
మహాదేవుడికి ప్రతి రూపంగా శివలింగాన్ని పూజిస్తారు. ఈ శివలింగానికి చాలా శక్తి ఉంది. శివుడిని శక్తికి మూలంగా భావిస్తారు. దేవతలు, రాక్షసులు కూడా శివుని శివలింగ శక్తిని తట్టుకోలేకపోయారు. మరి అలాంటిది మనం సాధారణ మనుషులం..మరి శివ శక్తిని తట్టుకోగాలమా.. అసలు ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
శివలింగం శక్తితో నిండి ఉంటుంది. ఇది చాలా శక్తిని విడుదల చేస్తుంది. అలాగే శక్తికి మూలం. ఈ కారణంగా కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించకూడదని నమ్ముతారు. శివలింగం నుంచి చాలా శక్తి వెలువడుతుందని.. దాని కారణంగా ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు విశ్వసిస్తారు. మానసిక ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు. శారీరక సమస్యలు మిమ్మల్ని చుట్టముట్టవచ్చు. ఆ ఇంట్లో నివసించే వారికీ కోపం రావచ్చు.
శివలింగం శక్తి జ్వాల వంటిది. శివలింగం నుంచి వెలువడే శక్తిని చల్ల బరిచేందుకు ప్రతిరోజూ శివలింగానికి నీరుని సమర్పిస్తారు. చందనం తో కప్పి ఉంచుతారు. ఇలా చేయడం దేవాలయాలలో మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించవచ్చని నమ్ముతున్నప్పటికీ.. కొన్ని నియమాలను పాటించాలి. లేకుంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు