శబరిమలలో కొలువైన హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం రికార్డ్ స్థాయిలో స్వాములు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 26న శబరిమలలో వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం అవుతుంది. ఈ మండల పూజకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు అంటే రేపు, ఎల్లుండ (డిసెంబర్ 25, 26 తేదీల్లో) అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలనీ భావిస్తోంది. దీంతో వర్చువల్, స్పాట్ బుకింగ్‌లను పరిమితం చేయనున్నట్లు టీడీబీ ప్రకటించింది. ముఖ్యమైన పర్వదినాల సమయంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 26న శబరిమలలో వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అయ్యప్ప మండల పూజ సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తారని భావించిన టీడీబీ రేపు 50వేల మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుండగా.. ఎల్లుండ 26 తేదీన 60వేలు మంది భక్తులకు మాత్రమే దైవం దర్శనానికి అనుమతిని ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల పాటు స్పాట్ బుక్ సంఖ్యని కూడా తగ్గించింది. కేవలం 5000 మందికి స్వామివారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నట్లు టీడీబీ ప్రకటించింది.
ఇప్పటికే ప్రారంభమైన స్వామివారి థంక అంకి ఊరేగింపు రేపు శబరిమల అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకుంటుంది. స్వామివారిని రేపు నగలతో అలంకరించనున్నారు. ఈ నేపధ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రేపు కేవలం అయ్యప్ప దర్శనం కోసం 50 వేల మందికి మాత్రమే అనుమతినివ్వనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..