Navaratri: నవరాత్రులలో దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి.. అమ్మ అనుగ్రహం మీ సొంతం

|

Oct 04, 2024 | 2:47 PM

తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ దుర్గాదేవిని వివిధ రూపాలను నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. దుర్గ దేవి వివిధ రూపాలను పూజించే సమయంలో దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నవరాత్రులలో ఏ రోజున దుర్గామాతకు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసుకుందాం.

Navaratri:  నవరాత్రులలో దుర్గదేవికి ఈ పువ్వులను సమర్పించండి.. అమ్మ అనుగ్రహం మీ సొంతం
Durga Devi Puja
Follow us on

హిందూ మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. తొమ్మిది రోజుల పాటు సాగనున్న ఈ పండగలో దుర్గాదేవి నవ దుర్గలుగా భక్తులతో పూజలను అందుకోనుంది. దేవీనవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ఈ రోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజూ దుర్గాదేవిని వివిధ రూపాలను నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాసం ఉంటారు. దుర్గ దేవి వివిధ రూపాలను పూజించే సమయంలో దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. నవరాత్రులలో ఏ రోజున దుర్గామాతకు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసుకుందాం.

  1. మొదటి రోజు: నవరాత్రుల మొదటి రోజు మా శైలపుత్రికి అంకితం చేయబడింది. దుర్గా స్వరూపమైన శైలపుత్రికి తెలుపు రంగు పువ్వులు అంటే ఇష్టం. అందుకే నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రీ దేవికి తెల్లటి పూలు, మల్లె, తెల్ల గులాబీ, తెల్లటి కరివేరు పువ్వులతో పుజిస్తారు.
  2. రెండవ రోజు: నవరాత్రి రెండవ రోజు తల్లి బ్రహ్మచారిణికి అంకితం చేయబడింది. బ్రహ్మచారిణి తల్లికి కూడా తెలువు రంగు పువ్వులు అంటే ఇష్టమని నమ్ముతారు. బ్రహ్మచారిణి తల్లికి తెలుపు రంగు పుష్పాలను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
  3. మూడవ రోజు: నవరాత్రుల మూడవ రోజు చంద్రఘంట రూపమైన దుర్గాదేవికి అంకితం చేయబడింది. పింక్ కలర్ పువ్వులు, కమలం, శంఖపుష్పి పువ్వులు చంద్రఘంట తల్లికి చాలా ప్రియమైనవి.
  4. నాల్గవ రోజు: నవరాత్రి నాల్గవ రోజు కూష్మాండ రూపమైన దుర్గాదేవికి అంకితం చేయబడింది. కూష్మాండ దేవికి మల్లెపూలు లేదా ఏదైనా పసుపు రంగు పువ్వును సమర్పించవచ్చు.
  5. ఐదవ రోజు: నవరాత్రులలో ఐదవ రోజు దుర్గాదేవి అవతారమైన స్కందమాత రూపానికి అంకితం చేయబడింది. పసుపు పువ్వులు స్కందమాతకు చాలా ప్రియమైనవి.
  6. ఆరవ రోజు: నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయని రూపమైన దుర్గాదేవికి అంకితం చేయబడింది. కాత్యాయని దేవికి బంతిపూలు అంటే చాలా ఇష్టమని ప్రతీతి.
  7. ఏడవ రోజు: నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి కాలరాత్రి రూపానికి అంకితం చేయబడింది. కాళరాత్రి తల్లికి నీలిరంగు కమలం అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. నీలం కమలం అందుబాటులో లేకుంటే.. కాళరాత్రికి ఏదైనా నీలం రంగు పువ్వును సమర్పించవచ్చు.
  8. ఎనిమిదవ రోజు: నవరాత్రుల ఎనిమిదవ రోజు దుర్గా దేవి అవతారమైన మహాగౌరీ రూపానికి అంకితం చేయబడింది. మహాగౌరికి మొగలి పువ్వులంటే చాలా ఇష్టమని ప్రతీతి.
  9. తొమ్మిదవ రోజు: నవరాత్రుల తొమ్మిదవ రోజు, చివరి రోజు దుర్గాదేవి సిద్ధిదాత్రి రూపానికి అంకితం చేయబడింది. నమ్మకాల ప్రకారం సంపెంగి, మందార పువ్వులు తల్లి సిద్ధిదాత్రికి ప్రియమైనవిగా భావిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి