Sharannavratri 2023: బ్రిటీష్ వారు ఫిరంగితో దాడి చేసినా ధ్వంసం కాని గ్రామం.. దొంగలు ఆశ్రయం ఇచ్చిన ఆలయ విశిష్టత ఏమిటంటే

|

Oct 17, 2023 | 9:56 AM

ఈ లోయలోని కాళీమాత విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదని.. అమ్మవారు స్వయంగా వెలిసినట్లు విశ్వాసం. హిందూ మత విశ్వాసాలకు కేంద్రంగా మారిన ఈ ఆలయానికి జిల్లా నుంచి ప్రజలు రావడమే కాదు.. ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.  ఈ ఆలయంలో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు.

Sharannavratri 2023: బ్రిటీష్ వారు ఫిరంగితో దాడి చేసినా ధ్వంసం కాని గ్రామం.. దొంగలు ఆశ్రయం ఇచ్చిన ఆలయ విశిష్టత ఏమిటంటే
Goddess Kali Temple
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఒకప్పుడు బందిపోట్ల సామ్రాజ్యం నడిచేది. అప్పట్లో ప్రజలు పట్ట పగలైనా యమునా నది లోయలలోకి వెళ్ళడానికి భయపడేవారు. ఇక్కడ ఉన్న లోయలో కాళి ఆలయం  ఉంది. అయితే ఇక్కడ నవరాత్రి సందర్భంగా కాళీమాతను ఆరాధించడానికి భక్తులు భారీగా చేరుకుంటారు.  ఇదే ఆలయంలో రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద పెద్ద దోపిడీ దొంగలు ఆశ్రయం పొందారు. ఆ ఆలయంలో ఉన్న ఏ దొంగను పట్టుకోలేదు.

ఈ నవరాత్రి జరిగే ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కాళికా ఆలయం కూడా ఒకటి. ఎందుకంటే నేటికీ ప్రజలు అమ్మవారికి గంటలు సమర్పించడానికి భక్తితో ఇక్కడకు వస్తారు. ఇక్కడ అమ్మవారికి గంటలు సమర్పించే సంప్రదాయాన్ని దొంగలు ప్రారంభించారు. యమునా లోయలో ఉన్న ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిదని నమ్మకం. ఒకసారి బ్రిటిష్ పాలన కాలంలో దేవకాలి గ్రామం మొత్తం ఫిరంగి బంతులతో ధ్వంసమైంది. అప్పట్లో కూడా ఈ ఆలయం గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. ఈ ఆలయంలో వెలసిన అమ్మవారి విగ్రహంలోని ప్రత్యేకత ఏమిటంటే.. గోడపై నుంచి అమ్మవారు ఆవిర్భవిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ లోయలోని కాళీమాత విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదని.. అమ్మవారు స్వయంగా వెలిసినట్లు విశ్వాసం. హిందూ మత విశ్వాసాలకు కేంద్రంగా మారిన ఈ ఆలయానికి జిల్లా నుంచి ప్రజలు రావడమే కాదు.. ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.  ఈ ఆలయంలో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. ఈ ఆలయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా  కీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. పూర్వం గ్రామ ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చేవారు కాదు.

ఇవి కూడా చదవండి

నిజానికి ఈ గుడిలో ఎప్పుడూ దొంగలు ఉండేవారు. ప్రత్యేకించి అరవింద్ గుర్జార్, ఫూలన్ దేవి, నిర్భయ్ గుర్జార్, జగన్ గుర్జర్‌లతో సహా అనేక మంది  దుండగులు ఈ ఆలయంలో ఆశ్రయం పొందారు. కోర్టులో ఉన్న కేసుల గురించి తీర్పు వెలువడిన అనంతరం ఇక్కడ అమ్మవారి ఆలయంలో తమ మొక్కులు చెల్లించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత మాత్రమే కాల్పులు జరిపేవారట. అయితే ఇప్పుడు అలా కట్టిన బందిపోట్లు తగ్గడంతో అమ్మవారి ఆలయం అందరి భక్తులతో పూజలను అందుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఆలయంలో కాల్పులకు బదులుగా అమ్మవారి స్తోత్రాలు  ప్రతిధ్వనిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.