Shani Vakri 2023: కుంభరాశిలోకి శని తిరోగమనం.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. అన్నీ గుడ్ న్యూస్‌లే..!

|

May 16, 2023 | 4:59 PM

శనిగ్రహం తిరోగమనం. అంటే.. శని తన స్వరాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 17న శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం వల్ల శుభకరమైన యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Shani Vakri 2023: కుంభరాశిలోకి శని తిరోగమనం.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. అన్నీ గుడ్ న్యూస్‌లే..!
Shani Dev
Follow us on

శనిగ్రహం తిరోగమనం. అంటే.. శని తన స్వరాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 17న శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించడం వల్ల శుభకరమైన యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో, శనిని కర్మ ప్రదాత అని పిలుస్తారు. ప్రతి వ్యక్తి వారి కర్మలను బట్టి మంచి, చెడు ఫలితాలను ఇస్తుంది. శనిగ్రహం.. రాశి, స్థానంలో మార్పు వచ్చినప్పుడు.. అది మానవ జీవితాలను, వారి పనులను ప్రభావితం చేస్తుంది. అయితే, శని గ్రహం త్వరలో కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు.

శని గ్రహం జూన్ 17, 2023 రాత్రి 10.48 గంటలకు కుంభరాశిలో తిరోగమన స్థితిలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగా చాలా పవిత్రమైన యోగా కేంద్రమై త్రికోణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభ రాశి..

కుంభరాశిలో శని తిరోగమనం చేయడం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. కేంద్ర త్రికోణ రాజయోగ ప్రభావంతో.. జీవితంలో చాలా ప్రయోజనాలను పొందుతారు. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా మేలు చేస్తుంది. ఉద్యోగం చేసే వారు ప్రమోషం పొందే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పని చేసే కార్యాలయంలో కొత్త బాధ్యతలను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మిథునరాశి..

మిథున రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వలన అద్భుత ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. పరిశోధనలు సాగించే వారు అద్భుత ఫలితాలను చూస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గుడ్ న్యూస్ వింటారు. నచ్చిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

సింహరాశి..

కుంభరాశిలో శని తిరోగమనం సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కున్నట్లయితే, సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం మీకు ధనలాభాన్ని కలిగిస్తుంది. వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. ఆత్మవిశ్వాసం, శక్తి రెట్టింపు అవుతుంది. ఈ సమయం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..