
శనీశ్వరుడిని న్యాయం, కర్మలకు దేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడి ఆశీస్సులు ఎవరిపై ఉంటాయో.. వారి జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అదే సమయంలో శనిశ్వరుడి చెడు దృష్టికి లోనైన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శని జయంతిని సూర్య భగవానుడు, ఛాయల కుమారుడు శనీశ్వరుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఈ రోజున శనిదేవుని ఆశీస్సులు పొందడానికి ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. లేకుంటే జీవితం దుఃఖంతో నిండిపోతుంది. ఈ రోజున పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
శని జయంతి 2025 ఎప్పుడంటే
పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిధి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తిధి మర్నాడు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శని జయంతిని మే 27వ తేదీ మంగళవారం జరుపుకుంటారు.
శని జయంతి నాడు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటంటే
ఎవరినీ అవమానించవద్దు.
శనీశ్వరుడు న్యాయాధిపతి. తనికి అన్యాయం అస్సలు ఇష్టం ఉండదు. శని జయంతి రోజున పొరపాటున కూడా ఏ పేద, బలహీన లేదా అవసరంలో ఉన్న వ్యక్తిని అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడికి కోపం రావచ్చు. ఈ రోజున మీకు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసుకోండి.
తామసిక ఆహారాన్ని మానుకోండి
శని జయంతి రోజున సాత్విక ఆహారం తీసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి. ఈ రోజున తామసిక ఆహారం తీసుకోవడం వలన శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని.. ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని నమ్ముతారు. కనుక ఈ రోజున స్వచ్ఛమైన, శాఖాహార ఆహారాన్ని తినండి.
జుట్టు, గోర్లు కత్తిరించవద్దు
కొన్ని నమ్మకాల ప్రకారం ని జయంతి రోజున జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ రోజున ఈ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అయితే ఈ నమ్మకాల వెనుక ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
నూనె దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
ఈ రోజున శనిదేవుడికి నూనె సమర్పించడం , దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే నూనె దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. చెడిపోయిన లేదా ఉపయోగించిన నూనెను ఎప్పుడూ దానం చేయవద్దు. ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, శుభ్రమైన నూనెను దానం చేయండి. అలాగే నూనె దానం చేసేటప్పుడు మనస్సులో భక్తి భావనను ఉంచుకోండి.
కోపం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా
శని జయంతి రోజున ప్రశాంతంగా , సానుకూలంగా ఉండాలి. కోపం, అసూయ లేదా ఏ విధమైన ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ రోజున ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండటం వల్ల శనిదేవుడు అసంతృప్తి చెందుతాడని.. చేపట్టిన పనిలో అడ్డంకులు ఏర్పడతాయని నమ్ముతారు.
శని జయంతి నాడు ఏమి చేయాలి?
శని జయంతి రోజున శనిదేవుడిని పూజించి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నీలం పువ్వులు సమర్పించండి. శని చాలీసా పారాయణం చేసి పేదలకు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా శనిదేవుడు సంతోషంగా ఉంటాడు. జీవితంలో ఆనందం,శ్రేయస్సు వస్తుంది.
శని జయంతి ప్రాముఖ్యత
హిందూ మతంలో శని జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును న్యాయం, కర్మలకు దేవుడిగా పరిగణించబడే శనిదేవుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ రోజున శనిదేవుడిని పూజించడం, ఉపవాసం ఉండటం ద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. శనిదేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఈ రోజున ఆయనను పూజించడం ద్వారా ఒక వ్యక్తి తన కర్మలను అనుససరించి న్యాయం పొందుతాడు. మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలు, చెడు పనులు చేసేవారికి శిక్షలు లభిస్తాయి.
జాతకంలో శని దోషం, ఏలినాటి శని లేదా శని ధైయ్యం వంటి వాటితో బాధపడేవారికి శని జయంతి చాలా ఫలవంతమైనది. ఈ రోజున చేసే చర్యలు, పూజల ద్వారా శని ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. శనిదేవుడు సంతోషించినప్పుడు… అతను తన భక్తులకు ఆనందం, శ్రేయస్సు, శాంతిని ప్రసాదిస్తాడు. శని జయంతి నాడు ఆయనను పూజించడం వల్ల జీవితంలో పురోగతి, శ్రేయస్సు లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు