Ram Janmabhoom: నేపాల్‌ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామాలు.. శిలలతో శ్రీరాముడు, సీత విగ్రహాల తయారీ

|

Feb 02, 2023 | 2:07 PM

యోధ్యలోని శ్రీరామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడి విగ్రహం నిర్మాణానికి ఉపయోగపడే రెండు పెద్ద శాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి.

Ram Janmabhoom: నేపాల్‌ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామాలు.. శిలలతో శ్రీరాముడు, సీత విగ్రహాల తయారీ
Shaligram Stones
Follow us on

అయోధ్యతో రామమందిరం నిర్మాణం పనులు చకచక సాగుతున్నాయి. శ్రీరాముడు , సీత విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ భారీ శిలలకు పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల నాటివని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేపాల్‌ నుంచి అయోధ్యకు తీసుకొచ్చే మార్గంలో ఈ శిలలకు భక్తులు పూజలు చేశారు. పలు చోట్ల ఘనస్వాగతం పలికారు.

శ్రీ విష్ణువు అవతారంగా సాలిగ్రామ శిలలను హిందువు భావిస్తారు. నేపాల్‍లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ సాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6కోట్ల ఏళ్ల నాటివనే నమ్మకం ఉంది.

2024కు ముందే సాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధమవుతోంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా సాలిగ్రామ శిలతో తయారు చేస్తున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు. 2024, జనవరి 1వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం