Sankranti 2022: సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా.. విశిష్టత తెలుసుకోండి..

| Edited By: Anil kumar poka

Jan 12, 2022 | 7:02 PM

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగను ఆంధ్రప్రదేశ్‏లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా

Sankranti 2022: సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా.. విశిష్టత తెలుసుకోండి..
Sankrati
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగను ఆంధ్రప్రదేశ్‏లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు, ఇంటి ముందు గొబ్బెమ్మలు ఇలా ఒక్కటేమిటీ సంక్రాంతి సందడి ఎక్కువగానే ఉంటుంది.

అయితే సంక్రాంతి, భోగి, కనుమ ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరిస్తారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ సంక్రాంతి రోజునే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు. మరి ఎందుకు అలా పెడతారో తెలుసుకుందామా.

ఈ పండగ తొలి రోజును భోగి అంటారు. రెండో రోజును మకర సంక్రాంతిగా.. మూడో రోజును కనుమగా పిలుస్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమ అంటారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి రంగులతో అందగా అలంకరించి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితి. తెలుగు సంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయినీ దేవిగానూ ఆరాధిస్తారు. పండగరోజు ముగ్గు వేసి.. ఆ ముగ్గులో గొబ్బెమ్మలను పెట్టి.. వాటిని పసుపు, కుంకుమ పూలతో అలంకరిస్తారు. అలా చేస్తే భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో సమానమాట. అందులో పెద్ద గొబ్బెమ్మను గోదా దేవిగా పూజిస్తారు. ఇక వాటి చుట్టు ఆడపడుచులు తిరుగుతూ సందడి చేస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ దేవికి సైతం చాలా ఇష్టమట. అందుకే పండగ రోజున ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెడితే ఇంట్లో లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్టు అని విశ్వసిస్తుంటారు.

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..