Sankranti 2024: మగవారికి మాత్రమే.. మహిళలకు ప్రవేశం నిషిద్ధం.. ఆ రోజున ఈ ఆంజనేయస్వామి గుడి స్పెషల్ అదే!

|

Jan 07, 2024 | 1:23 PM

పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వైభవంగా సంజీవరాయ స్వామి పొంగల్లు వేడుక జరుగుతోంది. ఈ వేడుకల కోసం స్వగ్రామానికి చేరుకున్న వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు స్థానికులతో కలిసి పొంగల్లను సమర్పిస్తున్నారు. స్వామివారికి పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించు కుంటున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా భక్తులు పూజిస్తారు. సంజీవరాయ స్వామికి మగవారు మాత్రమే పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ప్రతేకత.

Sankranti 2024: మగవారికి మాత్రమే.. మహిళలకు ప్రవేశం నిషిద్ధం.. ఆ రోజున ఈ ఆంజనేయస్వామి గుడి స్పెషల్ అదే!
Sanjeevaraya Temple
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలైంది. పలేల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో సందడి నెలకొంది. అంతేకాదు అనేక ఆలయాల్లో జాతరలు కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కడప జిల్లాలోని సంజీవరాయ స్వామి ఆలయంలో పొంగల్లు వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామివారికి ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు ఆదివారం ఇక్కడ మగవారు పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ.

పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో వైభవంగా సంజీవరాయ స్వామి పొంగల్లు వేడుక జరుగుతోంది. ఈ వేడుకల కోసం స్వగ్రామానికి చేరుకున్న వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు స్థానికులతో కలిసి పొంగల్లను సమర్పిస్తున్నారు. స్వామివారికి పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించు కుంటున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా భక్తులు పూజిస్తారు. సంజీవరాయ స్వామికి మగవారు మాత్రమే పొంగళ్ళు సమర్పించడం ఇక్కడ ప్రతేకత. ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం. మగవారు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పొంగళ్ళు స్వయంగా వండి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి నైవేద్యం కూడా ఆడవారు తినడం నిషేధం.

ఇవి కూడా చదవండి

స్థల పురాణం ఏమిటంటే

పూర్వం తిప్పాయ పల్లెలో ఓ వృద్ద సన్యాసి తిరుగుతూ ఉండేవాడని ఆయన స్త్రీలు పెట్టే ఆహారం తినేవాడు కాదట. అయితే ఆ సన్యాసి ఆ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయ స్వామిగా నామకరణం గ్రామం విడిచి వెళ్ళిపోయాడట. అయితే వెళ్తూ.. ఆ విగ్రహం ఉన్న చోట ఆలయ గోపురం నిర్మించకుండా కేవలం నలువైపులా గోడలను మాత్రమే నిర్మించమని సూచనలు చేశాడట. అంతేకాదు పొంగల్లు పెట్టె విషయంలో కూడా మగవారు మాత్రమే స్వామివారికి సమర్పించాలని.. మహిళలు ఆలయ ప్రహరి బయట నుంచి దర్శనం చేసు కోవచ్చునని చెప్పాడట. అప్పటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ.. నేటికీ స్థానికులు ఆ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..