Sankranti 2022- Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మూడు పండగలలో మొదటి రోజుని భోగి పండుగగా జరుపుకుంటారు. ఈరోజున తెల్లవారుఝామున స్నానాలు చేసి భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులు వేసి పీడలను అరిష్టాలను తొలగించాలని మరియు అందరూ భోగభాగ్యాలను పొందాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కోనసీమ లో వినూత్నంగా బోగి వేడుకలు జరిగాయి..
అమలాపురానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నందెపు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్దంగా బొగ్గు వేడుకలు జరిపారు… కరోనా మహమ్మారి పోవాలంటూ గో కరోన వైరస్ ఆకారాన్ని భోగి మంటల్లో వేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.. సాంప్రదాయానికి పుట్టినిల్లు కోనసీమ ప్రజలంతా ఈ సంవత్సరం వైరస్ బారినుండి విముక్తి పొందాలని కోరుకుంటూ భోగి సంబరాలు జరుపుకున్నారు… గంగిరెద్దులు.. హరిదాసు కీర్తనలు కోనసీమ పడుచు అమ్మాయిల సంబరాల మధ్య భోగి వేడుకలు అంబరాన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో భోగి పండగ సందడి..
Reporter: Satya Tv9 telugu
Also Read: నేడు ధనుర్మాసం చివరి రోజు.. 30 పాశురాలను పాడి రంగనాథుడిని భర్తగా పొందిన భోగి రోజు..