Yadadri Brahmotsavams: వైభవంగా నరసింహ స్వామి రథోత్సవం.. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం

|

Mar 02, 2023 | 7:14 AM

ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా రథోత్సవం నిర్వహిస్తుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్య విమాన రథోత్సవంపై ఊరేగుతూ తమని కటాక్షించడానికి వస్తున్న నరసింహ స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

Yadadri Brahmotsavams: వైభవంగా నరసింహ స్వామి రథోత్సవం.. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం
Yadadri Brahmotsavams
Follow us on

యాదాద్రి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ మాడ వీధుల్లో దివ్య విమాన రధోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు రథానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా రథోత్సవం నిర్వహిస్తుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దివ్య విమాన రథోత్సవంపై ఊరేగుతూ తమని కటాక్షించడానికి వస్తున్న నరసింహ స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ రధోత్సవంలో ఆలయ ఈఓ గీత, చైర్మన్ నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నేడు వార్షిక బ్రహ్మోత్సవాల్లో 10 వ రోజు. రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..