Badradri: రాములోరి కళ్యాణానికి పసుపు కొట్టి తలంబ్రాలు సిద్ధం చేసిన భక్తులు.. పెండ్లి కొడుకుగా శ్రీరాముడు

| Edited By: Balaraju Goud

Mar 26, 2024 | 12:42 PM

రాములోరి పెళ్లికి భద్రాద్రి సిద్ధమవుతోంది. పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారి పెళ్లి పనులు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. పసుపు దంచి పెళ్లి తలంబ్రాలు కలిపే ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద తలంబ్రాలు కలిపే వేడుకను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. దీంతో భద్రాద్రి శ్రసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం కళ్యాణ శోభను సంతరించుకుంది.

Badradri: రాములోరి కళ్యాణానికి పసుపు కొట్టి తలంబ్రాలు సిద్ధం చేసిన భక్తులు.. పెండ్లి కొడుకుగా శ్రీరాముడు
Sita Ramachandraswamy Temple, Bhadrachalam
Follow us on

రాములోరి పెళ్లికి భద్రాద్రి సిద్ధమవుతోంది. పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారి పెళ్లి పనులు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. పసుపు దంచి పెళ్లి తలంబ్రాలు కలిపే ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం వద్ద తలంబ్రాలు కలిపే వేడుకను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. దీంతో భద్రాద్రి శ్రసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం కళ్యాణ శోభను సంతరించుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవవి వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు మిధిలా స్టేడియంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగే సీతారాముల కళ్యాణం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకకు ఏప్రిల్ 17వ తేదీన అభిజిత్ లగ్నమందు స్వామి వార్ల కళ్యాణ ముహూర్తం ఖరారైంది. అలాగే మరుసటి రోజు ఏప్రిల్ 18వ తేదీన స్వామివారికి మహాపట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ రెండు ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివార్ల పెళ్లి తంతు ప్రారంభమైంది.

శ్రీసీతారామ కల్యాణ మహోత్సవ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని ఉదయం ఆలయంలో స్వామివార్లకు పంచామృతలతో అభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేంపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. స్వామివారి సమక్షంలో పసుపు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా భక్తులు,ముత్తైదువుల సమక్షంలో ఘనంగా కొనసాగించారు. అనంతరం మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను ముత్తైదువుల చేతుల మీదుగా కలిపి ప్రారంభించారు.ఈ తలంబ్రాలు కలిపే వేడుకకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణ తలంబ్రాలను తమ స్వహస్త్రాలతో కలిపి భక్తులు తరించారు.

ఈ తలంబ్రాలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వడ్లను గోటితో ఒలిచి తీసిన బియ్యాన్ని వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చి ఈ తలంబ్రాల బియ్యంలో కలిపి స్వామివారికి సమర్పించారు. ఇక రామదాసు కాలం అనాటి నుంచి అనవాతిగా వస్తున్న బియ్యం పసుపు, కుంకుమ ఆనాటి నైజాం ప్రభువుకు ఎంతో ప్రీతిపాత్రమైన సుగంధ ద్రవ్యాలు, గులాల్ రంగు కలిపిన ఈ తలంబ్రాలను కళ్యాణానికి సిద్ధం చేస్తున్నారు. ఇతర ఆలయాల్లో తలంబ్రాలు పసుపు రంగులో ఉండడం సహజం. కానీ భద్రాచల దేవస్థానంలో స్వామివారి కల్యాణ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండడం విశేషం. కాగా, ఏప్రిల్ 17వ తేదీన స్వామివారి కళ్యాణం అనంతరం ఈ తలంబ్రాలను ప్రతి భక్తునికి అందజేసేలా భద్రాద్రి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…