రంజాన్ (Ramadan) మాసం వచ్చిందంటే.. హైదరాబాద్ (Hyderabad) పాత బస్తీలో సందడి మొదలవుతుంది. మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, హలీమ్ ఘుమఘుమలు, ఎండు ఫలాల మధుర రుచులు పంచుకుంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందు ముస్లింలు తమ ఇళ్లను, మసీదులకు సుందరంగా అలంకరించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. రంజాన్ ప్రారంభం కాకముందే బట్టలు ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి పాత వస్తువులు తీసివేస్తారు. పాతబస్తీలో వ్యాపారులు రంజాన్ ముందు తమ తమ షాపులో భారీగా స్టాక్ చేసుకుంటున్నారు. వస్త్ర వ్యాపారులు కూడా సూరత్, కోల్ కతా, ఢిల్లీ, బనారస్ ప్రాంతాలకు వెళ్లి కొత్త కొత్త డిజైనింగ్ దుస్తులకు ఆర్డర్స్ ఇస్తారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస(Fasting) దీక్ష ముగిసిన తర్వాత ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హలీమ్ తినడానికి ఇష్టపడతారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా భోజన ప్రియులు హలీం తినలేకపోయారు. ఈ సంవత్సరం మంచి హలీమ్ తినాలని ఎదురు చూస్తున్నారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా హలీమ్ అందిస్తామని హలీం వ్యాపారస్థులు చెప్తున్నారు. అయితే ఈ సారి హలీం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హలీమ్ తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలు పెరగడంతో ధరలు పెంచక తప్పదని నిర్వాహకులు అంటున్నారు.
ప్రజల అభిరుచికి అనుగుణంగా హలీమ్ అందిస్తామని హోటళ్ల యజమానులు తెలిపారు. ఈ సంవత్సరం వంట నూనె ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రంజాన్ సమీపిస్తుండడంతో కొన్ని హోటళ్ల యజమానులు అప్పుడే కౌంట్ డౌన్ బోర్డు ఏర్పాటు చేశాడు. అటుగా వెళ్లే వారు కౌంట్ డౌన్ బోర్డుచూసి హలీమ్ భుజించడానికి రోజులు సమీపిస్తున్నాయని సంబర పడుతున్నారు.
– నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also Read
Vastu Tips: పెళ్లయిన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదు..!
Telangana Crime: కోరిక కాదన్నందుకు తీవ్రంగా కొట్టి.. స్పృహ తప్పినా వదలకుండా
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. హైకోర్టుకు 800 పేజీల నివేదిక..