Ayodhya: ప్రాణ ప్రతిష్ట శుభ వేళ ఇంట్లోనే శ్రీ రాముడిని పూజించే పధ్ధతి.. పఠించాల్సిన శ్లోకం ఏమిటంటే

|

Jan 22, 2024 | 9:20 AM

శ్రీరాముడు ప్రతిష్టా పవిత్రోత్సవం సందర్భంగా ఇంటిలోని పుజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీ రాముడు  విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించి ఆ పై పంచామృతంతో స్నానం చేయించండి. అనంతరం రాముడికి నీటితో అభిషేకం చేయండి. శుభంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి బట్టలు ధరింపజేయండి. చందనంతో తిలకం దిద్దండి. అనంతరం పూజ గదిని పీఠాన్ని పూలు, దండలతో అలంకరించండి. తరువాత అక్షత, పుష్పాలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసి దళం  మొదలైన వాటిని సమర్పించండి. రామయ్యను ఎరుపు, పసుపు, తెలుపు పువ్వులతో పూజించవచ్చు.

Ayodhya: ప్రాణ ప్రతిష్ట శుభ వేళ ఇంట్లోనే శ్రీ రాముడిని పూజించే పధ్ధతి.. పఠించాల్సిన శ్లోకం ఏమిటంటే
Lord Sri Ram Puja At Home
Follow us on

నేడు (జనవరి 22వ తేదీ) సోమవారం చరిత్రలో నిలిచిపోయే రోజు. అయోధ్యలోని రామాలయంలో అభిజీత్ ముహూర్తంలో బాల రామయ్య విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించడానికి రామ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యావత్ దేశమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం రామ్ లల్లాను ప్రతిష్టించనుండగా.. సాయంత్రం శ్రీ రామ జ్యోతి వెలిగించనున్నారు. ఈ రోజున ఇంట్లో ఆచార నియమాల ప్రకారం శ్రీరాముడిని పూజిస్తే పుణ్యం లభిస్తుంది. ఇంట్లో రాముడిని ఎలా పూజించాలి.. ఎలా దీపాలు వెలిగించాలి తెలుసుకుందాం..

ఈ ఉదయం నుంచి మృగశిర నక్షత్రం ఉందని బ్రహ్మయోగం ఏర్పడగా.. ఉదయం 7.15 నుండి సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడిందని చెప్పారు. మూడు యోగాలు ఏర్పడిన శుభ సందర్భంలో శ్రీరాముడిని పూజించవచ్చు. మధ్యాహ్నం ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడవచ్చు.

శ్రీ రాముని పూజా విధానం

శ్రీరాముడు ప్రతిష్టా పవిత్రోత్సవం సందర్భంగా ఇంటిలోని పుజగదిలో పీఠాన్ని ఏర్పాటు చేసి శ్రీ రాముడు  విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించి ఆ పై పంచామృతంతో స్నానం చేయించండి. అనంతరం రాముడికి నీటితో అభిషేకం చేయండి. శుభంగా పొడి బట్టతో విగ్రహాలను తుడిచి బట్టలు ధరింపజేయండి. చందనంతో తిలకం దిద్దండి. అనంతరం పూజ గదిని పీఠాన్ని పూలు, దండలతో అలంకరించండి. తరువాత అక్షత, పుష్పాలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసి దళం  మొదలైన వాటిని సమర్పించండి. రామయ్యను ఎరుపు, పసుపు, తెలుపు పువ్వులతో పూజించవచ్చు.

ఇవి కూడా చదవండి

పూజ అనంతరం పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకంలతో పాటు స్వీట్లను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి. లేదా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని కూడా అందించవచ్చు. పూజ సమయంలో రాముని నామాన్ని జపించండి. శ్రీ రామ్ చాలీసా పఠించండి. ఏక స్లోకి రామాయణం కూడా చదవవచ్చు. అనంతరం నెయ్యి దీపం లేదా ఆవనూనె దీపం లేదా కర్పూరంతో శ్రీరాముడికి హారతి ఇవ్వండి. దీపావళికి జరుపుకునే విధంగా దీపాలను వెలిగించండి.

రామ పూజ మంత్రం

ఓం రామచంద్రాయ నమః
ఓం రామ రామాయ నమః
ఓం నమః శ్రీ రామచంద్ర
శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్.

ఏక స్లోకి రామాయణం

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||

అనంతరం మంగళహారతి శ్లోకాలను పాటిస్తూ శ్రీ రాముడుకి హరతినివ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..