Donation to Ram Temple: అయోధ్యలో రామమందిరానికి రఘురామకృష్ణరాజు విరాళం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు

|

Jan 16, 2021 | 5:40 PM

ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు

Donation to Ram Temple: అయోధ్యలో రామమందిరానికి రఘురామకృష్ణరాజు విరాళం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు
Follow us on

Donation to Ram Temple: ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. ఈరోజు భక్తులతో కలిసి రూ.1,11,111లు అందజేశారు. ఇప్పటికే అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తన మూడు నెలల వేతనాన్ని అంటే రూ.3.9లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. హిందువుల శతాబ్దాల కాలం నాటి స్వప్నం సాకారమయ్యే సమయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎవరి శక్తి మేరకు వారు ఎంత మొత్తమైనా విరాళం ఇవ్వాలని కోరారు. మరో వైపు దేశ వ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు రామ మందిర నిర్మాణానికి విరాళం అందిస్తున్నారు.

Also Read: నీ అందానికి నీ మంచితనమే కారణం అంటూ మహేష్ బాబు పై మంచువారబ్బాయి ప్రశంసల వర్షం