Jagannath Rath Yatra: జగన్నాథుడు రథం వెళ్లే మార్గంలో బంగారు చీపురుతో శుభ్రం ఎందుకు చేస్తారు? సంప్రదాయం ఏమిటంటే..

ఆషాఢ శుక్ల పక్షం రెండవ రోజు నుంచి అంటే జూన్ 27 నుంచి పూరి జగన్నాథ ఆలయంలో గొప్ప రథయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్నాథ ఆలయం ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. దీనిని 'చెరా పహారా' అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో జగన్నాథుడు రథయాత్ర ప్రయాణం ప్రారంభమయ్యే ముందు.. రథం వెళ్లే మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనికి కారణాన్ని తెలుసుకుందాం.

Jagannath Rath Yatra: జగన్నాథుడు రథం వెళ్లే మార్గంలో బంగారు చీపురుతో శుభ్రం ఎందుకు చేస్తారు? సంప్రదాయం ఏమిటంటే..
Jagannath Rath Yatra

Updated on: Jun 27, 2025 | 9:05 PM

ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఇది ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమైంది. ఈ మహా రథ యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ప్రయాణిస్తారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో ‘చేరా పహారా’ అనే ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో యాత్ర ప్రారంభమయ్యే ముందు రథం వెళ్లే మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఇప్పుడు మీరు బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

బంగారు చీపురుతో శుభ్రం ఎందుకు చేస్తారంటే?

పూరి జగన్నాథ ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేకమైన ‘చేరా పహారా’ ఆచారం వెనుక లోతైన విశ్వాసం. స్వచ్ఛత దాగి ఉంది. ఈ సంప్రదాయంలో ఎవరుబడితే వారు బంగారు చీపురుతో శుభ్రం చేయలేరు. రాజుల వారసులు మాత్రమే ఈ ప్రత్యేక ఆచారంలో పాల్గొంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం బంగారాన్ని విలువైన, అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. రథం వెళ్ళే మార్గాన్ని శుభ్రం చేయడానికి బంగారంతో చేసిన చీపురును ఉపయోగించడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

రథయాత్ర ప్రారంభమయ్యే ముందు.. మూడు రథాల మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి, వేద మంత్రాలు జపిస్తారు. ఈ సంప్రదాయాన్ని భగవంతుడిని స్వాగతించడానికి సన్నాహానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు, ఆ మార్గం పూర్తిగా స్వచ్ఛంగా, గౌరవప్రదంగా ఉండాలి. ఇలా చేయడం ద్వారా.. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవికి కృతజ్ఞత తెలియజేస్తారని, భక్తులు భగవంతుని పాదాల వద్ద తమ ఉత్తమమైన వాటిని అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని వ్యక్తపరుస్తారని మత విశ్వాసం ఉంది. అందుకే ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు