Lord Rama Puja: బాల రామయ్య ప్రతిష్ట సమయంలో.. ఇంట్లోనే ఎలా పూజ చేయాలంటే..

|

Jan 20, 2024 | 1:26 PM

రామయ్య కొలువుదీరుతున్న దృశ్యాన్ని చూడాలని.. పూజించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరూ అయోధ్యకు వెళ్ళలేరు. ఈ నేపధ్యములో మీరు అయోధ్యకు వెళ్లలేకపోతే.. బాల రామయ్య ప్రతిష్టాపన రోజున రామయ్య ఆశీర్వాదం పొందడానికి ఇంట్లో రాముడిని ఆచారనియమాల ప్రకారం పూజించవచ్చు. ఈ రోజు పూజ విధానం తెలుసుకుందాం.. 

Lord Rama Puja: బాల రామయ్య ప్రతిష్ట సమయంలో.. ఇంట్లోనే ఎలా పూజ చేయాలంటే..
Srirama Puja In Home
Follow us on

కోట్లాది హిందువుల కల తీరే జనవరి 22వ తేదీ చారిత్రలో నిలిచిపోనుంది. కొన్ని శతాబ్దాల పాటుగా రామ భక్తులంతా ఎదురుచూస్తున్న రోజు రాబోతోంది. వైదిక సంప్రదాయం ప్రకారం అయోధ్యలోని రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రామయ్యకు పట్టాభిషేకం జరగనుంది. అయితే రామయ్య కొలువుదీరుతున్న దృశ్యాన్ని చూడాలని.. పూజించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరూ అయోధ్యకు వెళ్ళలేరు. ఈ నేపధ్యములో మీరు అయోధ్యకు వెళ్లలేకపోతే.. బాల రామయ్య ప్రతిష్టాపన రోజున రామయ్య ఆశీర్వాదం పొందడానికి ఇంట్లో రాముడిని ఆచారనియమాల ప్రకారం పూజించవచ్చు. ఈ రోజు పూజ విధానం తెలుసుకుందాం..

పూజగదిని శుభ్రం చేసుకోండి..

ముందుగా ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసుకోండి. అనంతరం దేవుళ్ల విగ్రహాలను శుభ్రం చేయండి. దేవుడి పటాలను శుభ్రమైన గుడ్డతో తుడవండి.రామయ్య విగ్రహానికి స్నానం చేయించండి. లేదా రాములవారి చిత్రాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఉత్తరం.. తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్య మూలగా పరిగణిస్తారు. ఈ దిక్కులో పూజ చేయడం అత్యంత ఫలవంతం. ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంట్లో శ్రీ రాముడిని ఇలా పూజించండి

  1. ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని సభ్యులందరూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇప్పుడు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిమీద ఎర్రటి వస్త్రాన్ని వేడి.. శ్రీరాముని విగ్రహం లేదా చిత్రాన్ని అమర్చండి.
  2. శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ముందుగా శ్రీరాముడిని పూజించి అనంతరం హనుమంతుడిని పూజించండి. ఇప్పుడు ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి.. హనుమంతుని పూజ చేయకపోతే శ్రీరాముడి పూజ అసంపూర్ణమని.. శ్రీరాముని ఆశీస్సులు లభించవని విశ్వాసం.
  3. ఇవి కూడా చదవండి
  4. ముందుగా రాముని విగ్రహానికి నీటితో అభిషేకం చేసి అనంతరం పంచామృతంతో స్నానం చేయించాలి. ఇప్పుడు మళ్లీ నీటితో స్నానం చేయించండి
  5. రాముడికి తిలక ధారణ చేసి.. పువ్వులు, ధూపం, దీపలతో పూజను చేయండి. శ్రీ రామునికి నైవేద్యంగా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ తో పాటు చలిమిడి, పానకాన్ని సమర్పించండి. రామజనం స్తుతితో రాముడిని పూజించడం ప్రారంభించండి.
  6. రాముడిని పూజించేటప్పుడు రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. రామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు భక్తుడిపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించండి.
  7. అనంతరం రామ చరిత మానస్ ను పఠించవచ్చు లేదా ఇంట్లో రామాయణ పఠనాన్ని చేయండి.
  8. దీపావళి రోజు రాత్రి చేసే విధంగా ప్రాణ ప్రతిష్ట రోజు సాయంత్రం ఇంటి బయట దీపాలను వెలిగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు