Ram Nath Kovind – Statue of Equality: శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. శంషాబాద్ ముచ్చింతల్ (Mucchinthal) లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది (Ramanuja Sahasrabdi) సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతోపాటు భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో రామ్‌నాథ్ కోవింద్ దాదాపు రెండు గంటలపాటు సందర్శించనున్నారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇలా..
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ, సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. దాదాపు రెండు గంటల పర్యటనలో సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రత్యేక పూజలు, ఆలయలను సందర్శించనున్నారు. ప్రసంగం అనంతరం 5 గంటలకు జీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సైబాబాద్ పోలీస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించమని పేర్కొంది.
Also Read: