
తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. యస్..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్నాళ్లు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు. అట్ ద సేమ్ టైం… ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగాను దుమారం రేపుతున్నాయి. గత ప్రభుత్వంపై ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఒక ఎత్తయితే.. తిరుమల లడ్డూ పేరిట చేసిన ఆరోపణలు మరో ఎత్తు. ఎందుకంటే తిరుమల శ్రీవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదం అన్నా భక్తులు అంతే పవిత్రంగా చూస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ప్రతిపక్షం కూడా అంతే సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగా గతంలో టీటీడీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసురుతూ ఎక్స్ ఫ్లాట్ ఫాంలో ట్వీట్ చేశారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు...