Polala Amavasya: జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి పోలాల అమావాస్య రోజున తులసి పూజను ఎలా చేయాలంటే..

|

Aug 29, 2024 | 2:56 PM

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఉదయం 7:24 గంటలకు ముగుస్తుంది. కనుక పోలాల అమావాస్యను సోమవారం, 2 సెప్టెంబర్ 2024న జరుపుకుంటారు. పోలాల అమావాస్య ఉదయం 4.38 గంటల నుంచి 5.24 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6.09 నుండి 7.44 గంటల వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

Polala Amavasya: జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి పోలాల అమావాస్య రోజున తులసి పూజను ఎలా చేయాలంటే..
Polala Amavasya
Follow us on

హిందూ మతంలో పోలాల అమావాస్య రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు తులసి మొక్కకు ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఉంది. జీవితం సుఖసంతోషాలతో కొనసాగడానికి, పిల్లలు సౌఖ్యం కోసం మహిళలు పోలాల అమావాస్య రోజున ఉపవాసం ఉంటారు. దుఃఖాల నుండి బయటపడటానికి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున తులసి మొక్కను పూజించడం, ప్రదక్షిణ చేయడం ద్వారా మహిళలు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున తులసి మొక్కకు ప్రదక్షిణం చేయడం వలన కష్టాలు, దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:21 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 3న ఉదయం 7:24 గంటలకు ముగుస్తుంది. కనుక పోలాల అమావాస్యను సోమవారం, 2 సెప్టెంబర్ 2024న జరుపుకుంటారు. పోలాల అమావాస్య ఉదయం 4.38 గంటల నుంచి 5.24 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6.09 నుండి 7.44 గంటల వరకు పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

పోలాల అమావాస్య రోజున తులసి ప్రదక్షిణ విధానం

సోమవతి అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

ఇవి కూడా చదవండి

తులసి మొక్కను గంగాజలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించండి.

తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయండి.

తులసి మొక్కను పుష్పాలు, చందనం మొదలైన వాటితో అలంకరించండి.

తులసి మొక్కను సవ్యదిశలో 108 సార్లు ప్రదక్షిణ చేయండి.

ప్రదక్షిణ చేసేటప్పుడు, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ‘ లేదా ‘ఓం తులసీ మాతా నమః’ అనే మంత్రాన్ని జపించండి.

పూజా సమయంలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

పోలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతేకాదు మోక్షం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేసే సమయంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయరాదు. తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్కను ఎప్పుడు బడితే అప్పుడు తీయరాదు.

తులసిని సకల దేవతలకు ఇష్టమైనడిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విష్ణుమూర్తికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్కను ఇంటి ఆవరణలో లేదా ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పోలాల అమావాస్య రోజున తులసికి ప్రదక్షిణ చేయడం ద్వారా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు