
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌లో కర్ణి మాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దుర్గా దేవి అవతారంగా భావించే కర్ణి మాతకు అంకితం చేయబడింది. అయితే ఈ ఆలయానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు బహిరంగంగా తిరుగుతాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఈ ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ప్రసాదాన్ని ఎలుక తాకినా లేదా వావి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నా.. అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు. అయితే ఆ ఎలుకలు కర్ణి మాత వారసులు, అనుచరులకు పునర్జన్మలు. ఒక పురాణం ప్రకారం కర్ణిమాతా పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలయత్ తెహసీల్ లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగే ప్రయత్నంలో ఆ సరస్సులో పడిపోతాడు. అప్పుడు కర్ణిమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుంది. మొదట యముడు తిరస్కరించినా చివరికి మనసు మార్చుకొని లక్ష్మణ్ తో పాటు కర్ణిమాత మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతాడు అని చెప్పాడట. అప్పటి నుంచి ఎలుకలు కర్ణి మాత ఆలయంలో నివసించే సంప్రదాయం ఉంది.
ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఇవి చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణి మాతకు చిహ్నంగా భావిస్తారు. వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ భక్తుడికైనా తెల్ల ఎలుకను చూస్తే.. అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణి మాత ఆలయ సందర్శనతో ..ఈ ప్రత్యేక ఆలయం, దీని సంప్రదాయాల వైపు దేశం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పర్యటన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాదు రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
కర్ణి మాత ఆలయం భారతదేశం నుంచి మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం దాని ప్రత్యేక అనుభవం, ప్రత్యేక మత సంప్రదాయం కారణంగా విదేశీ పర్యాటకులలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో జరిగింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పని తీరు చూడ ముచ్చటగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై దేవతలు, దేవుళ్ళకు సంబందించిన పౌరాణిక కథల అందమైన చెక్కడాలు ఉన్నాయి. ఈ ఆలయంలో రోజుకు అనేకసార్లు హారతి, భజనలు నిర్వహిస్తారు. ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. కర్ణి మాత ఆలయం కేవలం ఆద్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు. రాజస్థాన్ కి చెందిన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు