కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి అయిన తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ నెలకొంది. కొవిడ్ (Covid) పరిస్థితులు తగ్గుతుండటంతో భక్తులు భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు దీరాయి. తనిఖీలకు సమయం పడుతుండటంతో గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి ఉండాల్సి వస్తోంది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తిరుమలకు చేరుకున్న యాత్రికులకు అద్దె గదుల కొరత ఏర్పడింది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు భక్తులు. నిన్న 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది.
మరోవైపు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి(Tirupati) ఆలయానికి వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్ల(Arjitha Seva Tickets)ను రిలీజ్ చేయనుంది. మూడు నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రోజుల పాటు కేటాయిస్తారు.
Also Read
Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
Glenn Maxwell-Vini Raman: ప్రేయసినే పెళ్లాడిన ఆర్‌సీబీ ఆల్ రౌండర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Credit score: బ్యాడ్ క్రెడిట్ స్కోర్ వల్ల ఇన్ని నష్టాలా..! తప్పక తెలుసుకోండి..