Vidura Niti: నీతివంతుడితో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరమని చెప్పిన విదురుడు.. ఎందుకంటే..

|

Oct 22, 2021 | 8:55 AM

Vidura Niti: మహాభారతం నేటి మానవుల జీవితానికి మంచి చెడుల గురించి తెలుపుతుంది. ధర్మరాజు, భీష్ముడు, విదురుడు వంటి వారు ఎలా జీవించాలో నేర్పితే.. దుర్యోధనుడు, శకుని..

Vidura Niti: నీతివంతుడితో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరమని చెప్పిన విదురుడు.. ఎందుకంటే..
Vidura Niti
Follow us on

Vidura Niti: మహాభారతం నేటి మానవుల జీవితానికి మంచి చెడుల గురించి తెలుపుతుంది. ధర్మరాజు, భీష్ముడు, విదురుడు వంటి వారు ఎలా జీవించాలో నేర్పితే.. దుర్యోధనుడు, శకుని వంటివారు ద్వారా ఎలా జీవించకూడదో తెలుస్తోంది. ఇక ధృతరాష్ట్రుడికి సవతి తమ్ముడు విదురుడు. మహానీతిమంతుడు. కురు వంశ పితామహుడైన భీష్ముడు దగ్గర విద్యాబుద్ధులను అభ్యంసించిన విదురుడు ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రి. పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్షసాక్షి. అన్యాయం సహించని నైజం విదురుడు. ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదన్నది విదురుడు నీతి. వైరం లేకుండా జీవించడం ఒక సాధన. విదురుడికి, అక్రూరుడికి, ధర్మరాజుకు శత్రువులే లేరు.
కురుక్షేత్రం యుద్ధ సమయంలో దృతరాష్ట్రుడికి విదురుడు అనేక నీతికథలను చెప్పాడు. తన హితోక్తులతో దృతరాష్ట్రుడి.. తన కొడుకులకు బుద్ధి చెప్పి.. కురువంశం నాశనం కాకుండా కాపాడుకోవాలని విదురుడు చెప్పాడు. ముఖ్యంగా మనిషి ఎలా జీవిస్తే ఆనందం పొందుతాడో తెలిపాడు..ఎవరైనా మనల్ని ఆదరిస్తే ఆనందం కలుగుతుంది. అదే అనాదరణకు గురైతే కోపం పొందేవారు ఏమీ సాధించలేరు. అవమానాలను వ్యక్తం చేయకుండా, ఆ స్థితినే విజయానికి మెట్టుగా భావించడం ద్వారా శత్రువును జయించాలన్నది విదుర బోధ.

కౌరవుల తమను ఎంత బాధ పెట్టినా ధర్మరాజు క్షమించాడు. ఆ వ్యక్తిత్వం గురించి విదురుడు .. దుర్యోధనుడి వద్ద ప్రస్తావిస్తూ.. సుయోధనా.. ఎవరైనా మనం చేసిన తప్పులను క్షమించి ఆదరిస్తే.. ఆ క్షమను అసమర్థతగా భావించకూడదు. క్షమించడం కంటే బలమైన అస్త్రం లేదు. సమర్థుడి క్షమ- సమయం ఆసన్నమైనప్పుడు భూమిని సైతం నశింపజేయగల శక్తిగా పరిణమిస్తుంది. ధర్మరాజుతో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరం.. అని హెచ్చరించాడు. కుటుంబంలో ఎవరూ లేని వ్యక్తిని, విపత్తుల్లో పడిన స్నేహితుణ్ని, దారిద్య్రం వల్ల ఆకలితో అలమటిస్తున్న శత్రువును, సంతానం లేని సోదరిని అక్కున చేర్చుకొని ఆశ్రయమివ్వాలని విదురుడు చెప్పాడు. విదురుడు నీతిసూత్రాలు నేటికీ అందరికీ ఆచరణీయాలే… ‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పడం వల్ల శత్రువును బాధించకపోవచ్చు… కానీ, మహానుభావుడి పలుకులు గురి తప్పవు. జీవరాశులన్నింటితో పాటు భూమినీ అవి నాశనం చేయగలవు’ అన్నది విదురుడు చెప్పిన హితోక్తి.

Also Read: UAE Golden Visa: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న లెజెండరీ సింగర్ చిత్ర.. ఫోటో సోషల్ మీడియాలో షేర్