Personality Test: చెవుల మనిషి వ్యక్తిత్వానికి దర్పణం.. చెవుల ఆకారం బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..

|

Aug 01, 2024 | 10:00 AM

చెవి ఆకారం గురించి మాట్లాడితే మానవులలో ప్రధానంగా మూడు లేదా నాలుగు రకాల చెవి ఆకారం ఉంటుంది. గుండ్రని చెవులు, చతురస్రాకార చెవులు, కోణాల చెవులు వంటివి. సముద్ర శాస్త్రం ప్రకారం చెవులు మానవ వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడిస్తాయి. అంతేకాదు అదృష్ట చక్రాన్ని కూడా మార్చేస్తాయి.

Personality Test: చెవుల మనిషి వ్యక్తిత్వానికి దర్పణం.. చెవుల ఆకారం బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..
Personality Test
Follow us on

చాలా మంది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చేతులను చూసి.. నుదిటిని చూడటం ద్వారా గుర్తించవచ్చ అని చెబుతారు. అంతేకాదు పుట్టుమచ్చ, వేళ్ళ తీరు వంటి వాటిని చూసి చాలా మంది వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని అంటారు. అయితే చాలా మందికి ఓ రహస్యం తెలియదు. గోడకు కూడా చెవులే అని సామెతలా మనిషి చెవులు కూడా వారి రహస్యాలను చెబుతుంది. దీనితో పాటు చెవి ఆకారం కూడా వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కష్టపడి పని చేసే తత్వం లేదా సరదాగా ఉండే నేచర్, త్వరగా కోపగించుకోవడం లేదా సిగ్గుపడడం బట్టి చెవుల ఆకారాన్ని బట్టి చెప్పవచ్చు.

చెవి ఆకారం గురించి మాట్లాడితే మానవులలో ప్రధానంగా మూడు లేదా నాలుగు రకాల చెవి ఆకారం ఉంటుంది. గుండ్రని చెవులు, చతురస్రాకార చెవులు, కోణాల చెవులు వంటివి. సముద్ర శాస్త్రం ప్రకారం చెవులు మానవ వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడిస్తాయి. అంతేకాదు అదృష్ట చక్రాన్ని కూడా మార్చేస్తాయి.

పెద్ద చెవులు

ఇవి కూడా చదవండి

చెవులు పెద్దగా ఉంటే .. అటువంటి వారు చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. దానికి తోడు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. బహిరంగంగా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్థిరమైన మనస్తత్వంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సులభంగా ప్రభావితం కారు. ఆపద సమయంలో వెనుదిరగరు. అంతేకాదు పెద్ద చెవులు ఉన్నవారిలో జీవితంలో డబ్బుకు, కీర్తికి లోటు ఉండదు.

వంకర చెవులు

చెవులు వంగి ఉంటే వారు చాలా సులభంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. కేవలం లాజిక్, తక్కువ ఎమోషన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. సర్దుబాటు చేసుకుంటారు. చిటికెలో ఎలాంటి పరిస్థితినైనా నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

చిన్న చెవులు

చెవులు చాలా చిన్నవిగా ఉన్నవారు చాలా పిరికి స్వభావం కలిగి ఉంటారు. బయట తక్కువ సమయం.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. అవసరమైనప్పుడు తన అభిప్రాయాన్ని ఎలా వ్యక్తపరచాలో వీరికి బాగా తెలుసు.

ఇరుకైన చెవులు

చెవి అడుగుభాగం W- ఆకారంలో ఉంటే.. ఇలాంటి చెవులను కోణాల చెవి అంటారు. వీరికి ఫాంటసీలో జీవించడం చాలా ఇష్టం. ఊహాలోకంలో ఉన్నదంతా తన సొంత ప్రపంచంలా భావిస్తారు. వీరి ఆలోచనలో సృజనాత్మకంగా ఉంటారు. ప్రపంచం గురించి భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకంగా జీవిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు