ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..ఇక్కడ పెరిగే రాయి కలియుగాంతానికి చిహ్నం

| Edited By: Ravi Kiran

Sep 23, 2023 | 8:30 PM

పాతాళ భువనేశ్వర్ గుహలో నాలుగు యుగాలకు ప్రతీకగా మొత్తం నాలుగు రాతి కట్టలు ఉన్నాయి. వీటిల్లో ఒక రాయి నెమ్మదిగా పైకి లేస్తుంది.. ఈ రాయి కలియుగానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రాయి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని చెబుతారు. ఈ రాయి గుహలోని గోడను తాకిన రోజు కలియుగ అంతం అని కూడా విశ్వాసం.

ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..ఇక్కడ పెరిగే రాయి కలియుగాంతానికి చిహ్నం
Patal Bhuvaneshwar
Follow us on

హిందూమతంలో గణేశుడి ఆరాధన విశిష్టమైంది. విఘ్నాలకధిపతిని సకల దేవతలతో పాటు సామాన్యులు కూడా పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం భాద్ర మాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయక చవితిగా పది రోజుల పాటు జరిగే ఉత్సవాలను జరుపుకుంటారు. హిందూ దేవతల గురించి అనేక ఆధ్యాత్మిక కథలు , పురాణ కథలు ఉన్నాయి. శివపార్వతుల పుత్రుడు గణేశుడు భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్మకం. పురాణాల కథనాల ఆధారంగా వినాయకుడి తలను శివుడు తన త్రిశూలంతో కట్ చేసిన తల నేటికీ ఒక ప్రదేశంలో ఉంది. తనను తన భార్య పార్వతి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్న బాలుడి తలను వేరు చేసి వధించాడు. శివుడు చేసిన పనికి పార్వతీ దేవి చాలా బాధపడింది. అప్పుడు సకల దేవతలు పార్వతి తనయుడికి తిరిగి ప్రాణం పోయడానికి తలకు బదులు ఏనుగు తలను అతికించి జీవం పోశారు. అయితే శివుడు కోప్మ తగ్గి శాంతించిన తర్వాత కత్తిరించిన  వినాయకుడి తలను ఒక రహస్య గుహలో భద్రంగా ఉంచాడు. ఆ గుహ నేటికీ ఉంది. కోల్‌కతాకు సమీపంలో ఈ గుహ ఉంది. ఎవరైనా కోల్ కతా వెళ్ళినప్పుడు వెళ్లి అక్కడ వినాయకుని శిరస్సును చూడవచ్చు.

ఆ రహస్య గుహ ఎక్కడ ఉందంటే

గణేశుడి తలను శివుడు ఉంచిన గుహ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వర్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ రక్షిత గుహ పర్వతం లోపల దాదాపు 90 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుహలోని గణేశుడి విగ్రహాన్ని ఆదిగణేష్ అని పిలుస్తారు. ఈ గుహను క్రీ.శ.1941లో ఆదిశంకరాచార్యులు కనుగొన్నారు. ఈ సంఘటన గురించి  స్కాందపురాణంలోని మానస విభాగంలో ప్రస్తావించబడింది.

కలియుగం అంతానికి చిహ్నం

పాతాళ  భువనేశ్వర్ గుహలో నాలుగు యుగాలకు ప్రతీకగా మొత్తం నాలుగు రాతి కట్టలు ఉన్నాయి. వీటిల్లో  ఒక రాయి నెమ్మదిగా పైకి లేస్తుంది.. ఈ రాయి కలియుగానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రాయి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని చెబుతారు. ఈ రాయి గుహలోని గోడను తాకిన రోజు కలియుగ అంతం అని కూడా విశ్వాసం.

ఇవి కూడా చదవండి

33కోట్ల మందికి నివాసం ఈ గుహ

పాతాళ భువనేశ్వర్ గుహ చాలా మందికి తెలియదు. ఈ రహస్య గుహలో వినాయకుడు మాత్రమే కాదు, శివునితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు నివసిస్తున్నారు. ఈ గుహలో బద్రీనాథ్, కేదార్నాథ్ , అమర్నాథ్ కూడా కనిపిస్తాయి. బద్రీనాథ్‌లో యమ కుబేరుడు, వరుణుడు, లక్ష్మి, గరుడుడు ,గణేశుడు వంటి బద్రీ రాతి శిల్పాలు ఉన్నాయి. అమర్‌నాథ్ గుహ, భారీ రాతి గదులు ఇక్కడ గుహలో  ఉన్నాయి.

కొండల నుండి నీటి చుక్కలు

పాతాళ భువనేశ్వర్ గుహలో కాల భైరవుని నాలుక కూడా కనిపిస్తుంది. కాల భైరవుడు తన నోటి నుండి గర్భంలోకి ప్రవేశించి చివరకు చేరుకోగలిన వారికీ మోక్షం లభిస్తుందని నమ్ముతారు. గుహలో గణేశుడి రాతి విగ్రహం 108 రేకుల హ్మకమలం ఉంది. ఈ బ్రహ్మకమలం నుండి నీరు సహజంగానే గణేశుడి తలపై నీటి బిందువుల రూపంలో నిరంతరం పడుతూ ఉంటుంది.

ఈ గుహను ఎవరు కనుగొన్నారంటే

గుహలో ఉన్న బ్రహ్మకమలాన్ని శివుడు స్థాపించాడని నమ్ముతారు. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశ రాజు ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నాడని చెబుతారు. పురాణాల ప్రకారం ఒక రోజు అతను అడవి జింకను వెంబడిస్తున్నప్పుడు ఈ గుహ ముందు ఆ జింక కనిపించింది. అప్పుడు, రాజు కుతూహలంతో గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పాటు శివుడిని గణపతి తలను చూశాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)