Bonalu 2022: నేడు ఆషాడం బోనాల చివరి రోజు.. దీంతో భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులకు దర్శనమిస్తోంది. తెల్లవారు జామునుంచే అమ్మవారి ఆలయం వద్ద కోలాహలం మొదలైంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూలో నిల్చుకున్నారు. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆనవాయితీగా మొదటి బోనాన్ని మాజీ మాంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు కోడలు సమర్పించారు. పీవీ సింధు కూడా అమ్మావారికి బోనం సమర్పించింది. లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు రెండు రోజులు పాటు జరగనున్నాయి. రేపు రంగం, ఘటం ఊరేగింపు ఉండనుంది.
బోనాలు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా లాల్ దర్వాజ పరిసర ప్రాంతల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ రోజు నుంచి రేపటి వరకూ చార్మినార్, మీరు చౌక్, ఫలక్ నుమా, బహదూర్ పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఏటా ఆషాడ మాసంలో గోల్కొండ కోటలో ఈ బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలతో ముగుస్తాయి.
ఈరోజు పాతబస్తీ లాల్ దర్వాజ తో పాటు నగరంలోని అంబర్‌పేట్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో అనేక దేవాలయాల్లో బోనాల పండగను వైభంగా నిర్వహిస్తున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..