Numerology: ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..

|

Dec 25, 2021 | 12:50 PM

Numerology: తన భవిష్యత్, మంచి చెడుల గురించి తెలుసుకోవోడానికి కొంతమంది జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికం అంటూ ఎలా నమ్ముతారో.. మరికొందరు న్యూమరాలజీని..

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..
Numerology
Follow us on

Numerology: తన భవిష్యత్, మంచి చెడుల గురించి తెలుసుకోవోడానికి కొంతమంది జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికం అంటూ ఎలా నమ్ముతారో.. మరికొందరు న్యూమరాలజీని కూడా అదే విధంగా నమ్ముతారు. జాతకంలో రాశి, గ్రహాలు, నక్షత్రాలు, మనిషి జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాయో.. అదే విధంగా పుట్టిన తేదీ కూడా జీవిత విధానంపై ప్రభావితం చేస్తుందని న్యూమరాలజీని నమ్మేవారు విశ్వసిస్తారు. సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి.  రాడిక్స్ సంబంధాలు కూడా నవగ్రహాలలో ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది.

న్యూమరాలజీ ప్రకారం 01, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారిని 1వ రాడిక్స్ అంటారు. సూర్యుడు 1వ రాడిక్స్‌కు అధిపతి. సూర్యుడు గ్రహాలకు అధిపతి.. కనుక ఈ తేదీల్లో పుట్టిన రాడిక్స్ వారికి సూర్యుడి అనుగ్రహం ఉంటుందని.. నమ్మకం. అంతేకాదు ఈ వ్యక్తులు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. అంతేకాదు నిర్భయంగా, ధైర్యంగా ఉంటారు. రాడిక్స్ నంబర్ 1 వ్యక్తులకు సంబంధించిన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..

పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు: 
రాడిక్స్ నంబర్ 1 ఉన్న వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరి కిందా పని చేయలేరు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ రాడిక్స్  వారు రాజకీయాల్లో లేదా వ్యాపార రంగంలో ప్రయత్నిస్తే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

ఆర్ధికంగా ఉన్నత స్థితి: 
రాడిక్స్ నంబర్ 1 ఉన్న వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. నిర్ణయాధికారం వీరి సొంతం.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ వ్యక్తులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఏ పని చేపట్టినా పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో, శక్తితో చేస్తారు. అందుకనే వీరిని ఎక్కువ మంది ఆరాధిస్తారు. ఈ వ్యక్తులు తమ మంచి లక్షణాలతో ముందుకు సాగుతారు.   డబ్బు , కీర్తిని సంపాదిస్తారు.

నమ్మకస్థులు: 
ఈ రాడిక్స్ గలవారు మంచి భాగస్వామి. అది వివాహమైనా లేదా ప్రేమ వివాహమైనా సరే తమ భాగస్వామికి విధేయులుగా ఉంటారు. సూర్యభగవానుని  ఆశీర్వాదంతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో  మంచి అనుబంధం కలిగి ఉంటారు. జీవితాంతం తన జీవిత భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.

Also Read:  క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్.. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి