Ramatheertham: విజయనగరం జిల్లాలోని రామతీర్థం నీచాచలం కొండపై శ్రీరామును నూతన ఆలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఉదయం 10.08 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. మూడు కోట్ల నిధులతో ఈ రామాలయాన్ని నిర్మించనున్నారు. పూర్తి రాతి కట్టడంతో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, వంటశాల మెట్ల మార్గం ఆధునికీకరణ, కోనేరును అభివృద్ధి చేయనున్నారు అధికారులు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దుండగులు.. శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అప్పుడది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించి.. ధ్వంసమై విగ్రహం స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో పాటు.. ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమం చేపట్టింది. పాత ఆలయం కూల్చి అదే స్థానంలో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. కాగా, ఇప్పటికే ప్రధాన ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ జరిపి పూజా కైంకర్యాలు జరుపుతున్నారు ఆలయ పండితులు. ఆరు నెలల వ్యవధిలో నూతన ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
Also read:
Disinvestment: ప్రస్తుతానికి ఆ బ్యాంకుల ప్రయివేటీకరణ లేనట్టే.. కీలక సమాచారం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..