ఆశ్వయుజ మాసంలో వచ్చే శారదీయ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా ఆరాధిస్తారు. అమ్మవారికి చిహ్నంగా భావించి 09 మంది బాలికలకు ప్రత్యేక పూజలను చేసే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఉంది. నవరాత్రులలో అమ్మవారి స్వరూపంగా భావిస్తూ.. తొమ్మిది రోజులు ఒకొక్క బాలికను కొందరు పూజిస్తారు. మరికొందరు నవరాత్రుల ముగింపు రోజున అష్టమి లేదా నవమి నాడు తమ ఇంట్లో 09 మంది అమ్మాయిలను పిలిచి పూజిస్తారు. ఈ సంవత్సరం అష్టమి 03 అక్టోబర్ 2022 న వచ్చింది. నవమి తేదీ 04 అక్టోబర్ 2022 న వచ్చింది. నవరాత్రుల్లో ఏ వయసులో ఉన్న అమ్మాయిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో. పూజ విధానం పూర్తిగా తెలుసుకుందాం.
ఏ వయసు బాలిక ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుందంటే..
నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో రెండేళ్ల బాలిక కుమారి, మూడేళ్ల బాలిక.. త్రిమూర్తి, నాలుగేళ్ల బాలిక .. కళ్యాణి, ఐదేళ్ల బాలిక.. రోహిణి, ఆరేళ్ల బాలిక.. కాళిక, ఏడేళ్ల బాలిక.. చండిక, ఎనిమిదేళ్ల బాలిక .. శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గగా, పదేళ్ల బాలికను సుభద్రగా పరిగణిస్తారు.
నవరాత్రులలో కన్యా పూజ ఫలం:
రెండేళ్ల బాలికను పూజిస్తే దారిద్య్రం తొలగిపోతుందని, మూడేళ్ల బాలికను పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. నాలుగు సంవత్సరాల బాలికను పూజించడం వలన సాధకుని జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.. ఐదేళ్ల బాలికను పూజించడం వలన శరీరంలోని రుగ్మతలు తగ్గుతాయని.. దుఃఖ తొలగుతుందని విశ్వాసం. ఆరేళ్ల బాలిక్కి పాదపూజ చేయడం ద్వారా సాధకుడికి విద్య, విజయం లభిస్తాయని, ఏడేళ్ల బాలికను పూజించడం వల్ల గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం. అదేవిధంగా ఎనిమిదేళ్ల బాలికకు పూజలు చేయడం.. వివాదాలు పరిష్కారం అవుతాయని.. కోర్టు-కోర్టు కేసుల్లో విజయం లభిస్తుందని నమ్మకం. తొమ్మిదేళ్ల బాలికను పూజించడం ద్వారా కష్టమైన పనులు రెప్పపాటులో పూర్తవుతాయి. పదేళ్ల బాలికను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.
కన్యా పూజకు ముఖ్యమైన నియమాలు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)