Navagraha Pradakshina: దేవుడి గుడి వెళ్ళిన వెంటనే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షణ చేస్తారు.. అయితే సర్వ సాధారణంగా నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేస్తారనే విషయం అందరికి తెలుసు… కానీ నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం… ఒక్కొక్క విధంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది.. కనుక నవగ్రహాలకు ముందుగా 9 ప్రదక్షిణలు చేసి… వారి వారి అనుగ్రహం కోసం వేర్వేరుగా ప్రదక్షిణాలు చేయాల్సి ఉంది. అంటే..
నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు అందుకని ముందుగా సూర్యుడి అనుగ్రహం కోసం 10 సార్లు ప్రదక్షణ చేయాలి.. అంతేకాదు.. ఆరోగ్య ప్రదాత సూర్యుడు… కనుక ఆరోగ్యం కోసం సూర్యుడిని ప్రార్దిస్తూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.
కీర్తికోసం చంద్రుడు ని కీర్తిస్తూ 11 సార్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది..సిరి సంపదల కోసం అంగారకుడికి… బుద్ది వికాశం కోసం బుధ గ్రహానికి 5, 12, 23 సార్లు ప్రదక్షణలు చేయాలి.
గౌరవ ప్రతిష్టల కోసం గురుభగవానుడికి ౩,12, 21 సార్లు ప్రదక్షణ చేయాలి. అందం, ఆకర్షించే సౌందర్యం శుక్రుడి సొంతం.. కనుక శుక్రుడి అనుగ్రహం కోసం ఆరు సార్లు , ఆనందమైన జీవితం కోసం శని భగవానుడికి 8 సార్లు ప్రదక్షణ చేయాల్సి ఉంది. దైర్యం కోసం రాహువు నాలుగు సార్లు..వంశాభివృద్ధి కోసం కేతువుకి 9 సార్లు ఇలా యోగాలను అందించే నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రదక్షణలు చేయాల్సి ఉంది.. అయితే ఇలా నవ గ్రహాలకు ప్రదక్షణ చేయడం మంచిదే… కానీ ఏ దేవాలయలనికి వెళ్ళినా.. ముందుగా గర్భ గుడిలోని స్వామిని దర్శించుకుని… అనంతరం… నవ గ్రహ ప్రదక్షణలు చేయాలి.. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వీడి.. సుఖవంతమైన జీవితం లభిస్తుందని… జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: వీర్య కణాల సమస్యా… పురుషులు ఇలా శనగలను తింటే సరి..!!