- Telugu News Photo Gallery Spiritual photos History of rupala sangameswara temple in dinnedevarapadu kurnool
Rupala Sangameswara: నిమ్మచెట్టుతో శివలింగం చేసి ధర్మరాజు ప్రతిష్టించిన ఆలయం రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం ఎక్కడంటే
Rupala Sangameswara Temple:పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. నదీ తీర ప్రాంతాల్లో తమాచరిస్తూ.. అక్కడ దేవుళ్లను ప్రతిష్టించేవారని పురాణాల కథనం.. అలా పాండవులు దర్శించి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఆలయం ఉమ సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం.
Updated on: Jun 26, 2021 | 10:08 PM

కర్నూలు పట్టణం లోని జగన్నాథ గుట్ట లో తుంగభద్ర నది తీరాన కొలువైన దివ్యమైన ఉమ సమేత రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం..వందల సంవత్సరాల చరిత్ర గలది. దేవాలయ నిర్మాణం ఎంతో చూడ చక్కగా ఉంటుంది.విశాల ప్రాంగణంలో కొలువైన అమ్మ వారు,అయ్యవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం.

స్థల పురాణం ప్రకారం పాండవులు ఈ దేవాలయములో మహాదేవుని ప్రతిష్టించారు అని గాథ.ధర్మరాజు భీముని శివలింగం తీసుకొని రమ్మని చెప్పగా భీముడు కాశీ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవడం తో ధర్మరాజు నిమ్మ చెట్టు తో శివలింగాకృతి చేసి ప్రతిష్టించి పూజించారట.

భీముడు కాశీ నుంచి లింగాన్ని తీసుకొని రాగా దానిని కూడా సమీపంలో ప్రతిష్టించారని పురాణ గాథ. రెండు లింగాల ను కలిపి సంగమేశ్వర, రూపాల సంగమేశ్వర క్షేత్రంగా పిలువబడుతుంది. ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం ఎంతోగాను ఆకట్టుకుంటుంది.

ఆలయుం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలున్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీప ంలో పాప నాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.

వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది..ప్రతినిత్యం విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. సోమవారం, మాస శివరాత్రి,పండుగలప్పుడు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కార్తీక మాసం, శ్రావణ మాసం లో భారీ సంఖ్యంలో భక్తులు నది స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారు.





























