Narak Chaturdashi 2023: నరక చతుర్ధశిని ఎప్పుడు జరుపుకుంటారు.. యమ దీపం విశిష్టత ఏమిటంటే..

|

Nov 04, 2023 | 11:08 AM

నరక చతుర్దశిని కాళీ చౌదాస్ , నరక్ చౌదాస్ , రూప్ చౌదాస్ , చోటి దీపావళి అని కూడా పిలుస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నరక చతుర్దశి నవంబర్ది 11వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. హిందూ మతంలో నరక చతుర్దశికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నరక చతుర్దశి రోజున లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని.. దీంతో ఇంట్లో దారిద్య్రం తొలగిపోతుందని నమ్ముతారు. నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గి ఇళ్లల్లో సానుకూలత వ్యాపిస్తుంది.

Narak Chaturdashi 2023: నరక చతుర్ధశిని ఎప్పుడు జరుపుకుంటారు.. యమ దీపం విశిష్టత ఏమిటంటే..
Narak Chaturdashi
Follow us on

దీపావళి ముందు రోజు నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. కొంతమంది ముఖ్యంగా ఉత్తరాదివారు ఛోటీ దీపావళి కూడా ఈ రోజునే జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజు వస్తుంది. నరక చతుర్దశిని కాళీ చౌదాస్ , నరక్ చౌదాస్ , రూప్ చౌదాస్ , చోటి దీపావళి అని కూడా పిలుస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నరక చతుర్దశి నవంబర్ది 11వ తేదీ శనివారం జరుపుకోనున్నారు.

హిందూ మతంలో నరక చతుర్దశికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నరక చతుర్దశి రోజున లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని.. దీంతో ఇంట్లో దారిద్య్రం తొలగిపోతుందని నమ్ముతారు. నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గి ఇళ్లల్లో సానుకూలత వ్యాపిస్తుంది. నిజానికి నరక చతుర్దశిని జరుపుకోవడం వెనుక ఒక పురాణ కథ ఉంది.

నరక చతుర్ధశిని ఎందుకు జరుపుకుంటారంటే..

నరక చతుర్దశిని జరుపుకోవడం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. హిందూ విశ్వాసం ప్రకారం, ఈ రోజున విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అనంతరం శ్రీకృష్ణుడు నరకాసురుని చెరసాలలో బంధించబడిన 16 వేల మంది స్త్రీలను, మునులను విడిపించాడు. తాము రాక్షసుడి పాలనలోని కష్టాలనుంచి విముక్తి  పొందిన ఆనందంలో ప్రజలు  నరక చతుర్థి జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ప్రతి సంవత్సరం దీపావళి ముందు రోజుని నరక చతుర్దశిగా జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజున దీపాలు ఎందుకు వెలిగిస్టారంటే

ఛోటీ దీపావళి లేదా నరక చతుర్దశి రోజున ఇళ్లలో దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. మత విశ్వాసాల ప్రకారం  ఈ రోజున యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగిస్తారు. ఈ రోజున యముడిని పూజించడం వల్ల అకాల మృత్యుభయం తొలగిపోయి సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొందడానికి యముడి పేరుతో సాయంత్రం యమ దీపం వెలిగిస్తారు. అంతేకాకుండా ఇంటి తలుపులకు ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు. ఈ రోజున యమ ధర్మ రాజు అనుగ్రహం కోసం ఇంట్లో దీపం వెలిగించి పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు