Nandi Idol Drinking Milk: దాసాంజనేయ స్వామి ఆలయంలో వింత.. పాలు తాగుతున్న నంది విగ్రహం.. బారులు తీరిన భక్తులు

గతంలో అనేక ఆలయాల్లో చాలా వింతలు ప్రజలు చూశారు.  శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడి విగ్రహాల కంటి నుంచి నీళ్లు రావడం, సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలడం,   వినాయకుడు పాలు తాగడం, గుడి చుట్టు పంది ప్రదక్షణలు చేయటం.. పాము శివుడికి పూజలు చేయడం ఇలాంటి అనేక ఘటనలను చూశారు.

Nandi Idol Drinking Milk: దాసాంజనేయ స్వామి ఆలయంలో వింత.. పాలు తాగుతున్న నంది విగ్రహం.. బారులు తీరిన భక్తులు
Nandi Drinking Milk

Updated on: Dec 29, 2022 | 3:02 PM

ప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఎక్కడో చోట దర్శనమిస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత  ఎక్కడ ఎటువంటి వింత సంఘటనలు జరిగినా .. వెంటనే ప్రజల వద్దకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా దేవుడి గుడిలో చోటుచేసుకునే ఘటనలు ఎక్కువగా భక్తులను ఆకట్టుకుంటాయి. దేవుడి మహిమే నంటూ భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.  అయితే గతంలో అనేక ఆలయాల్లో చాలా వింతలు ప్రజలు చూశారు.  శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడి విగ్రహాల కంటి నుంచి నీళ్లు రావడం, సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలడం,   వినాయకుడు పాలు తాగడం, గుడి చుట్టు పంది ప్రదక్షణలు చేయటం.. పాము శివుడికి పూజలు చేయడం ఇలాంటి అనేక ఘటనలను చూశారు. అయితే తాజాగా తెలంగాణాలో నంది విగ్రహం పాలు తాగుతుంది. ఈ వింత ఘటనను చూడడానికి ప్రజలు బారులు తీరారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జారుతున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. మాత్రం కాస్త వింతగానే చూస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణంలోని పాత మార్కెట్ లోని దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఓ  నంది విగ్రహం పాలు తాగుతుంది. అక్కడున్న కొందరు చెంచాతో నంది విగ్రహానికి పాలు పట్టిస్తున్నారు.. దీంతో ఆ పాలను ఆ విగ్రహం తాగుతుంది..ఈ వీడియో ఒకటి వైరల్‌ అయింది.

నంది పాలు తాగుతున్న వీడియో

దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలియడంతో ఆలయం వద్ద భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. పాలు తాగించడం కోసం భక్తులు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. భారీగా క్యూల్లో భక్తులు బారులు తీరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..