Naga Panchami: నేడు నాగపంచమి.. కోరిన కోర్కెలు తీరాలంటే ఈ మంత్రం పఠిస్తూ పాలు సమర్పించండి..

|

Aug 21, 2023 | 8:13 AM

శ్రావణ మాసంలోని శుక్ల పక్షం రోజులలో వచ్చే నాగ పంచమి పవిత్రమైన పండుగగా భావించి పాములను పూజిస్తారు. నాగ పంచమి రోజున పాములను ఎవరైనా నియమ నిబంధనల ప్రకారం పూజిస్తే జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. నాగ పంచమి ఆరాధన వలన పాముకాటుతో సహా అన్ని భయాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు నాగుల అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం.. 

Naga Panchami: నేడు నాగపంచమి.. కోరిన కోర్కెలు తీరాలంటే ఈ మంత్రం పఠిస్తూ పాలు సమర్పించండి..
Naga Panchami 2023
Follow us on

హిందూ మతంలో పాములను నాగదేవతగా భావించి పూజిస్తారు. నాగుల ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సనాతన సంప్రదాయంలో ఏడు రకాల పాముల గురించి ప్రస్తావించారు. శేషు నాగు, వాసుకి నాగు, తక్షక నాగు, కర్కోటక నాగు, పద్మ నాగు, కులిక నాగు, శంఖనాగు వీటిని పూజించడం ద్వారా మనిషి జీవితంలో ఆనందం, అదృష్టం పొందుతారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం రోజులలో వచ్చే నాగ పంచమి పవిత్రమైన పండుగగా భావించి పాములను పూజిస్తారు. నాగ పంచమి రోజున పాములను ఎవరైనా నియమ నిబంధనల ప్రకారం పూజిస్తే జీవితానికి సంబంధించిన సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. నాగ పంచమి ఆరాధన వలన పాముకాటుతో సహా అన్ని భయాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు నాగుల అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం..

నాగ పంచమి పూజ కోసం మంత్రం

నాగ పంచమి నాడు.. సర్పరాజుని పూజించిన పుణ్య ఫలితాలను పొందడానికి రుద్రాక్ష జపమాలతో “ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తినాగః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని  జపించండి.

నాగదేవత మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. హిందూ విశ్వాసం ప్రకారం సర్పాలకు సంబంధించిన మంత్రాలతో దేనినైనా జపిస్తే,.. పాము కాటు అనే  భయం ఉండదు.
  2. భక్తి, విశ్వాసంతో నాగ దేవత మంత్రాన్ని పఠించడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల సుఖ సంతోషాలను  పొందుతాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. నాగ దేవత మంత్రాన్ని జపిస్తే పుణ్యం ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని ఇస్తుంది.
  5. హిందూ విశ్వాసం ప్రకారం  నాగ పంచమి రోజున, నాగుల ఆలయాన్ని సందర్శించడం.. నాగుల పూజిస్తూ.. ని మంత్రాన్ని పఠించడం శుభ ఫలితాలను తెస్తుంది. కోరిన కోరికలు నెరవేరతాయి.
  6. నాగ పంచమి రోజున నాగదేవతకు పాలతో అభిషేకం చేస్తూ ఈ నాగదేవత మంత్రాన్ని పఠిస్తే తరగని పుణ్యం లభిస్తుంది.
  7. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నాగ పంచమి నాడు సర్ప దేవుడి మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి  జాతకంలో రాహు-కేతువులకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)