సృష్టికి మూలం పంచభూతాలు.. ఈ శైవ క్షేత్రాలు పంచతత్వాలకు నిలయాలు.. దర్శనంతోనే కోర్కెలు నేరవేరతాయని నమ్మకం

|

Jun 24, 2024 | 10:43 AM

హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆలయాల మాదిరిగానే పంచతత్వాలపై ఆధారపడిన ఐదు శివాలయాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. కేవలం దర్శనంతో తన భక్తుని ఎటువంటి కోరిక అయినా కంటి రెప్పపాటులో నెరవేరుతుందని విశ్వాసం. శివుని అనుగ్రహాన్ని అందించే ఈ ఐదు పవిత్ర స్థలాలు ఎక్కడ ఉన్నాయి? వీటి ఆరాధనలో మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

సృష్టికి మూలం పంచభూతాలు.. ఈ శైవ క్షేత్రాలు పంచతత్వాలకు నిలయాలు.. దర్శనంతోనే కోర్కెలు నేరవేరతాయని నమ్మకం
Panchtatwa Temples
Follow us on

హిందూ మతంలో శివుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. కేవలం జలంతో అభిషేకం చేస్తే చాలు కొలిచిన భక్తుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. ప్రతి శివ భక్తుడు తన ఇంట్లోనే కాదు దేశంలోని వివిధ శివాలయాలకు వెళ్లి తన కోరిక మేరకు శివుడిని పూజిస్తూ ఉంటాడు. హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధించిన ఆలయాల మాదిరిగానే పంచతత్వాలపై ఆధారపడిన ఐదు శివాలయాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. కేవలం దర్శనంతో తన భక్తుని ఎటువంటి కోరిక అయినా కంటి రెప్పపాటులో నెరవేరుతుందని విశ్వాసం. శివుని అనుగ్రహాన్ని అందించే ఈ ఐదు పవిత్ర స్థలాలు ఎక్కడ ఉన్నాయి? వీటి ఆరాధనలో మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..

  1. జంబుకేశ్వర ఆలయం (నీటి మూలకం)
    తిరుచిరాపల్లిలో ఉన్న జంబుకేశ్వరాలయం నీటి మూలకానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆలయంలోని శివలింగాన్ని స్థానిక ప్రజలు అప్పు లింగంగా పూజిస్తారు.. ఇక్కడి పూజారులు స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుడిని పూజిస్తారు. జంబుకేశ్వరాలయం దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఒకానొకప్పుడు పార్వతీ దేవి ఇక్కడ మహాదేవుడిని నీటిలో నుంచి శివలింగాన్ని తీసి పూజించిందని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం.
  2. ఏకాంబరేశ్వర దేవాలయం (భూమి తత్వం)
    భూమి మూలకంపై ఆధారపడిన ఈ అద్భుత శివాలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. మామిడిచెట్టు కింద నెలకొల్పబడిన ఈ శివలింగాన్ని చూసినంత మాత్రాన శివ భక్తుడి కష్టాలు, బాధలు తొలగిపోతాయని ఒక నమ్మకం. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శివాలయం దేశంలోని 10 అతిపెద్ద దేవాలయాలలో ఒకటి.
  3. అరుణాచలేశ్వర దేవాలయం (అగ్ని తత్త్వం)
    తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ఈ ఆలయంలో శివుడు అగ్ని మూలకం రూపంలో పూజలందుకుంటున్నాడు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో మహాదేవుడిని సందర్శించడం, పూజించడం ద్వారా శివ భక్తుడి జీవితంలో చీకటి తొలగిపోతుంది. అపారమైన శక్తిని పొందుతాడు. అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ఈ శివాలయానికి ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు.
  4. నటరాజ ఆలయం (ఆకాశ తత్వం)
    తమిళనాడులోని చిదంబరం నగరంలో ఆకాశ మూలకం ఆధారంగా శివుని ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోని ఈ ఆలయాన్ని తిల్లై నటరాజ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు నృత్యం చేస్తున్న భంగిమలో విగ్రహం కనిపిస్తుంది. ఐదు మూలకాలపై ఆధారపడిన దేవాలయాలలో ఇది ఏకైక ఆలయం, ఇక్కడ లింగానికి బదులుగా.. విగ్రహం లేదా శివుని భౌతిక రూపాన్ని పూజిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం (గాలి మూలకం)
    వాయు మూలకంపై ఆధారపడిన శివుని ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని కాళ హస్తి ప్రాంతంలో ఉంది. ఎత్తైన కొండపై నిర్మించిన ఈ శివాలయాన్ని దక్షిణ కైలాసమని శివభక్తులు పిలుస్తారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం లోపల గర్భగుడిలో శివలింగం ఎత్తు సుమారు నాలుగు అడుగులు. ఈ శివలింగాన్ని వాయు లింగం లేదా కర్పూర లింగం అని కూడా అంటారు. ఈ శివలింగానికి జలాన్ని అభిషేకం చేయరు. ఈ ఆలయంలోని దీపం వెలుగు కదులుతూ ఉండి.. వాయు రూపంలో కొలువైన శివయ్య క్షేత్రంగా ప్రసిద్దిగాంచింది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.