
మన సమాజంలో పుట్టుమచ్చల గురించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారి గురించి వారు ఏది అంటే అది జరుగుతుంది అనే మాట గ్రామాల్లో తరచుగా వినిపిస్తుంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? అంటే ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు.
నాలుకపై పుట్టుమచ్చ ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన దైవిక సంకేతం. వీరు గత జన్మల్లో అనేక పుణ్యకార్యాలు, సామాజిక సేవ, పేదలకు అన్నదానం చేయడం వంటి పనులు చేయడం వల్లే ఈ జన్మలో అటువంటి విశేషమైన గుర్తులు పొందుతారని శాస్త్రం చెబుతోంది.
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు ఏదో ఒకటి అంటే అది వెంటనే జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వీరు చాలా సున్నితంగా ఉంటారు.వీరు ఎవరినైనా నమ్మి మోసపోయినప్పుడు లేదా మనస్తాపానికి గురైనప్పుడు వారి నోటి నుండి వచ్చే మాటలు ప్రభావం చూపుతాయని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ప్రత్యేకించి నాలుక అడుగు భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారికి దైవానుగ్రహం మెండుగా ఉంటుందని, వారు దేవునికి అత్యంత సన్నిహితులుగా ఉంటారని నమ్ముతారు.
నాలుకపై నల్లటి మచ్చలు లేదా పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి..
కళాకారులు – పండితులు: వీరు ప్రకృతిని ఆరాధిస్తారు మరియు గొప్ప కళా నైపుణ్యం కలిగి ఉంటారు.
మృదు స్వభావం: వీరు అందరితో మృదువుగా సంభాషిస్తారు. పండితులుగా పేరు తెచ్చుకుంటారు.
విజయపథం: వీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్పే మాటల్లోని అంతరార్థం.. వారిని మానసికంగా బాధపెట్టకూడదనే.. దైవిక శక్తులు, ప్రకృతి ఆశీస్సులు ఉన్న ఇటువంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని పండితులు వివరించారు.
(గమనిక: ఇది శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే. దీనిని TV9 ధృవీకరించడం లేదు.)