నిరాడంబరంగా శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ.. రేపటి నుంచి భక్తుల కేశఖండన నిలిపివేత..

|

May 10, 2021 | 11:09 PM

sahasra deepalankarana seva

నిరాడంబరంగా శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ.. రేపటి నుంచి భక్తుల కేశఖండన నిలిపివేత..
Follow us on

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాకారంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రదోషకాల సమయంలో స్వామి అమ్మవార్లను మండపంలో షోడశోపచార పూజా క్రతువులను అర్చక వేదపండితులు ఏకాంతంగా జరిపించారు. అనంతరం 1008 దీపాలను వేదమంత్రోచ్చారణాల నడుమ వెలిగించి దీప నివేదన చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను పల్లకిపై ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఏకాంతంగా సాగిన ఈ సేవలో ఆలయ అధికారులతోపాటు కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే పాల్గొన్నారు.

రేపటి నుంచి భక్తుల కేశఖండనను నిలిపివేత..

శ్రీశైల క్షేత్రంలో మంగళవారం నుంచి భక్తుల కేశఖండనను నిలిపివేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేవస్థాన క్షౌరకుల విజ్ఞప్తి మేరకు సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 24 మంది ఆలయ క్షౌరకులు కొవిడ్ బారినపడ్డారని.. ఇద్దరు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రభావం తగ్గే వరకు కేశఖండనశాలలు నిలిపివేస్తున్నామని అన్నారు. భక్తులు దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈఓ రామారావు కోరారు.

ఇవి కూడా చదవండి : తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేసర్.. తన ఫియాన్సీ ఫోటోను షేర్ చేసిన పాట్ కమిన్స్‌

Aadhaar: ఆధార్‌లోని అడ్రస్‌ను మార్చడం అద్దెదారులకు ఇక చాలా ఈజీ..! అయితే ఇలా చేయండి..!