AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు దర్శనం

Divine Vision at Tirumala: తిరుపతి ఆకాశంలో మేఘాల అమరకితో అద్భుత దృశ్యం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వరస్వామి నగరంలో మహాదేవుడు లింగరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిచ్చాడు. భక్తులను హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. మరోవైపు, ఓ సీతాకోక చిలుక గోవింద నామ రూపంలో దర్శనిచ్చి ఆశ్చర్యపరిచింది.

ఆకాశంలో అద్భుతం! తిరుమల శ్రీవారి సన్నిధిలో మహాదేవుడు  దర్శనం
Tirumala Shiva
Rajashekher G
|

Updated on: Mar 28, 2026 | 4:50 PM

Share

ఆకాశంలో మేఘాల కదలికలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మేఘాల కదలికలు, అమరికలు కొన్ని కొన్ని ఆకృతులను ఏర్పరచి ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా, పరమ పుణ్యక్షేత్రం తిరుపతి నగరంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తిరుపతి ఆకాశంలో మేఘాలు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి నగరంలో మహాదేవుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మహా లింగరూపం సాక్షాత్కరించింది. ఆకాశంలో పరమేశ్వరుడు లింగరూపంగా దర్శనమివ్వడంతో భక్తులందరూ హరహర మహదేవ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

గోవింద నామ రూపంలో..

నిరంతరాయంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగే తిరుపతి నగరంలో మరో అపురూప దృశ్యం కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి పవిత్ర నామం తలపించేలా.. ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది.

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Follow Us
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్
రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్