ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు అక్కడ ఉన్న హిందువులు అదరడం లేదు. బెదరడం లేదు.. కాబూల్ లోని ఆశామాయి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది హిందువులు , సిక్కులు నవరాత్రి వేళ మాతా ఆలయంలో భజనలు చేశారు కీర్తనలు పాడారు. తాలిబన్ల రాజ్యంలో కూడా మైనారిటీలు అక్కడ భక్తిశ్రద్దలతో నవరాత్రి వేడుకలు నిర్వహించడం సంచలనం రేపింది. కాబూల్‌లో ఇంకా 150 మందికి పైగా హిందువులు , 200 మందికి పైగా సిక్కులు ఉన్నారు. భారత్‌కు తరలించాలని వాళ్లు కేంద్రాన్ని పదేపదే కోరుతున్నారు. హిందూ ఆలయాలను , సిక్కు గురుద్వారాలను తాలిబన్లు టార్గెట్ చేసినప్పటికి వాళ్ల ఏమాత్రం భయపడడం లేదు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఉద్విగ్న వాతావరణం నెమ్మదిగా తగ్గుతోంది. దీనికి తాజా ఉదాహరణగా రాజధాని కాబూల్‌లో జరిగిన నవరాత్రి భజన కార్యక్రమాలను చూడవచ్చు. ఇక్కడ కాబూల్‌లో (కాబూల్ ఆఫ్ఘనిస్తాన్‌లో నవరాత్రి) నవరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక హిందూ పౌరులు కీర్తన, భజనలను చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబాన్ పాలనలో ఉంది. అన్ని ఆంక్షలు మరోసారి విధించబడ్డాయి. అయితే, మైనారిటీ అయిన హిందూ సమాజం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం కాబూల్‌లోని ఆశామాయి మందిరంలో నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అమెరికా సైన్యం ఉన్నంత వరకు మైనారిటీ హిందువు కమ్యూనిటీ కూడా ఇక్కడ బాగా జీవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు, సిక్కులు మైనారిటీలు. ముస్లింల మాదిరిగానే, హిందువులపై కూడా ఇప్పుడు ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, మతపరమైన కార్యకలాపాలు మాత్రం నిరాటకంగా కొనాసాగుతున్నాయి. అదే భాగంగా ఇక్కడ ఉన్న ఆశామాయి ఆలయంలో కీర్తన, భజలను నిర్వహించారు స్థానికులు.
కీర్తనలు, భజనలు..
ఇంతలో ఆశామాయి దేవాలయ నిర్వహణ కమిటీ ఛైర్మన్ రామ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా కాబూల్ లోని అస్మాయి దేవాలయంలో కీర్తనలు, భజనలు నిర్వహించాము. పేదలకు ఆహారాన్ని దానం చేసే భోజన భండారా కూడా నిర్వహించాము. తాలిబాన్ అంతరాయం కలిగించలేదు. ఈ కార్యక్రమానికి 150 మంది స్థానిక భక్తులు హాజరయ్యారని ఆయన వెల్లడించారు.
#Flash–
The members of Hindu community in Afghanistan last night celebrated the ongoing Navratri festival at the ancient Asamai Mandir in #Kabul .
They appealed Govt of India for their early evacuation due to acute economic and social hardships being faced by them.
V @PSCINDIAN pic.twitter.com/VyDnHO3zWT— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) October 12, 2021
కాబూల్‌లోని ఈ అస్మై ఆలయం కార్టే పర్వన్ గురుద్వారా నుండి 5 కి.మీ దూరంలో ఉంది. గత వారం ఇదే గురుద్వారాను అనుమానిత తాలిబాన్లు ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి: Minister KTR: మంత్రి కేటీఆర్ మెడలో పసుపు కండువా.. విషయం ఏంటో తెలుసా..
Atchannaidu Naidu: అయ్యో.. అచ్చెన్న పడిపోయారే.. ప్రభుత్వ కార్యక్రమంలో ఘటన..
Forced Conversions: సరిహద్దు గ్రామాల్లో బలవంతపు మతమార్పిడీలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న అకల్ తఖ్త్..