Meenakshi Devi: మూడు వక్షోజాలతో జన్మించిన అమ్మవారు.. శివ దర్శనంతో మాయం.. ఆ రహస్యం ఏమిటో తెలుసా

|

Jun 08, 2024 | 8:22 AM

ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తుశిల్ప కళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో రెండు దేవాలయాలు నిర్మించబడ్డాయి. మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం.. ఈ ఆలయంతో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న మీనాక్షి దేవి మూడు వక్షస్థల రహస్యం.

Meenakshi Devi: మూడు వక్షోజాలతో జన్మించిన అమ్మవారు.. శివ దర్శనంతో మాయం.. ఆ రహస్యం ఏమిటో తెలుసా
Meenakshi Devi Temple
Follow us on

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అపురూపమైన శిల్పకళా సంపద, నేటికీ సైన్స్ కూడా చేధించని మిస్టరీ ఆలయాలు అనేకం ఉన్నాయి. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని మదురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం వాస్తుశిల్ప కళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో రెండు దేవాలయాలు నిర్మించబడ్డాయి. మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం.. ఈ ఆలయంతో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువై భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవిగా పూజలను అందుకుంటున్న మీనాక్షి దేవి మూడు వక్షస్థల రహస్యం.

మీనాక్షి దేవి ఎవరు
శివుని భార్య అయిన పార్వతీ దేవి అవతారమే మీనాక్షిదేవి. హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం. మీనాక్షి అంటే మీనములు వంటి అక్షులు కలది.. (చేపలాంటి కళ్ళు) అని అర్ధం. మీనాక్షి దేవి అత్యంత అందమైన యువతి. చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు మీనాక్షి దేవి తనను భక్తి శ్రద్దలతో కొలిచిన వారి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే శక్తివంతమైన, దయగల దేవతగా పరిగణించబడుతుంది.

మూడు స్తనాల రహస్యం ఏమిటి?
హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య , రాణి కాంచనమాలలకు జన్మించింది. రాజ దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుడిని ప్రార్థించారు. శివుడి వరంతో పార్వతి దేవి ఈ దంపతులకు శిశివుగా జన్మించింది. మూడు సంవత్సరాల వయసులో మూడు స్తనాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది. తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపు రొమ్ము అదృశ్యమవుతుందని ఆకాశ వాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది.

ఇవి కూడా చదవండి

ప్రతిభా పాటవాలు కలిగిన యువతిగా
మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది. ఆమె పాలనలో మీనాక్షి దేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది. తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుడిని కలుసుకుంది. అతనిని చూడగానే మీనాక్షి దేవి మూడవ రొమ్ము అదృశ్యమైంది. దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది.

సుందరేశ్వరుని రూపంలో వివాహం
మీనాక్షి దేవి మూడవ రొమ్ము అదృశ్యమైన తరువాత.. ఆమె శివుదీని వివాహం చేసుకోమని అభ్యర్థించింది. ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించాడు. మీనాక్షి దేవత మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుని వివాహం చేసుకుంది. వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనకాశీ తిరుకల్యాణం లేదా చితిరై పండుగగా జరుపుకుంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు