Medaram Hundi: మేడారం సమ్మక్క సారమ్మ(Sammakka Saralamma) మహాజాతర హుండీ(Hundi)ల లెక్కింపు పూర్తయింది..గత జాతరతో పోల్చితే హుండీ ఆదాయం కొంతమేర తగ్గింది. దీంతో ఆదివాసీ పూజారుల్లో కొంచెం నిరుత్సాహానికి లోనైనయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు జాతరకు ముగింపు పలికారు. 2020 మేడారం జాతరలో మొత్తం 502 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 17 లక్షల రూపాయల ఆదాయం లభించింది.. ఈ సారి జాతరలో మొత్తం 517 హుండీలు ఏర్పాటు చేశారు.. కానీ ఆదాయం తగ్గింది.. 10కోట్ల 91లక్షల 62వేల రూపాయల ఆదాయం మాత్రమే లభించింది.. 18దేశాలకు చెందిన కరెన్సీ కూడా లభ్యమైంది.. హుండీ ఆదాయం అంతా బ్యాంకు ఖాతాలో జమా చేశారు.
భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకల లెక్క తేలాల్సి ఉంది.. ఐతే ఎనిమిది రోజులపాటు హనుమకొండ లోని టీటీడీ కళ్యాణ మండలంలో హుండీల కౌంటింగ్ నిర్వహించారు.. ఈసారి హుండీల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అంచనాలు వేశారు.. కానీ తగ్గిన ఆదాయం పూజారులను నిరుత్సాహానికి గురిచేసింది. హుండీ ఆదాయంలో 33శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది.. 13 మంది పూజారులు 33 శాతం వాటాను పంపకాలు చేసుకుంటారు.
Also Read: