Medaram Jatara 2022: ఆసియా(Asia)లోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవం మేడారం మహాజాతరలో తొలిఘట్టం మరికొద్ది నిమిషాల్లో ఆవిష్కృతమవనుంది.. మరికొద్ది క్షణాల్లో సారాలమ్మ ను ఆదివాసీ పూజారులు గద్దెలపై ప్రష్టించనున్నారు.. అదే సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై ప్రతిష్టిస్తారు.. అధికారిక లంచనాలతో స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేశారు
లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.. జాతరలో తొలి ఘట్టానికి మరికొద్ది క్షణాలు అంకురార్పణ జరుగుతుంది.. కన్నేపల్లి లోని సారాలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజలు నిర్వహించిన పూజారులు మేడారంకు పయనమయ్యారు…
డోలి వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఆదివాసీ పూజారులు సారాలమ్మను గద్దెలపైకి తరలిస్తున్నారు.. సారాలమ్మను తరలించే క్రమంలో మూడంచెల పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు.. రోబ్ పార్టీతో పాటు, తుడుందెబ్బ ఆధ్వర్యంలో సారాలమ్మ పూజారులకు రక్షణ కవచ్చంగా తరలిస్తున్నారు..
రాత్రి 9గంటల వరకు సారాలమ్మను గద్దెలపై ప్రతిష్టిస్తారు.. అదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతి రూపాలను కూడా గద్దెలపై ప్రతిష్టిస్తారు.. సారలమ్మ ఆగమనానికి సమయం ఆసన్నమవడంతో జిల్లా అధికార యంత్రాంగం, మంత్రులు, స్థానిక MLA సీతక్క ఘన స్వాగతం పాలికేందుకు ఏర్పాట్లు చేశారు..మరికొద్ది నిమిషాల్లో తొలిఘట్టం పూర్తవుతుంది..
Also Read: