కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలో అడుగు పెట్టం. నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అయింది. పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించే నెల ఈ మార్గశీర మాసం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం.. వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువు’’ అత్యంత విశిష్టత గలవి అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పాడు. అంటే హిందువులకు ఈ నెల ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే. హిందువులు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా శుభ ఫలితాలను ఇస్తుంది.
.ని మోక్షద ఏకాదశి అంటారు.
ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. ఏకాదశిలలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. భక్తితో ఉపవాసం, జాగరణ చేసే మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ నెలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఈ రోజు తెలుసుకుందాం..
మార్గశిరం దక్షిణాయనం చివరిభాగం.. మార్గశిర మాసం తరువాత అంటే పుష్యమాసం నుంచి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. కనుక ఈ మార్గశిర మాసంలోని పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం వంటిది అని పండితులు చెబుతారు. రోజులో బ్రాహ్మీ ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో.. ఏడాదిలో విష్ణుస్వరూపమైన మార్గశిర మాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బ్రాహ్మీమహూర్తంలో చేసే పూజకు ఎంత విశిష్టత ఉందో.. అదే విధంగా ఈ నెల రోజులు చేసే పూజకు అంత విశిష్టత ఉంది. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. మార్గశిర గురువారం, శనివారాలు చాలా ప్రాముఖ్యత గలిగినవి. ఈ నెలలో విష్ణువుని పూజిస్తారు.
సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదటి రోజు తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం నియమంగా పెట్టారు. ఈ మార్గశిర మాసంలోని మొదటి రోజు పాడ్యమి రోజున నదిలో స్నానం చేసి దీపాలు విడిచి పెట్టడమే కాదు పోలి కథను చదువుకోవడం శుభప్రదం అని ఓ నమ్మకం.
ఈ నెలలో కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు శ్రీ మద్భగవద్గీత జన్మించింది. మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమనీ శ్రీ కృష్ణుడు చెప్పాడు. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. నెలలో తొలి రోజు పాడ్యమి తిధి రోజున కార్తీకమాసంలో నదీ స్నానం చేసి, వ్రతాలు చేసిన వారు నదీ స్నానం చేసి దీపాలు వదలు పోలిని స్వర్గానికి పంపిన కథ చదువుతారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.