
హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజున స్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజున పూర్వీకులకు తర్పణం విడవడం, పిండ ప్రదానం చేయడం ద్వారా వ్యక్తి విశేష ఫలితాలను పొందుతాడు. వేద క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య రోజున శివుడు , విష్ణువులను పూజించడంతో పాటు స్నానం చేయడం, దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటిలో సుఖ, శాంతి, ఐశ్వర్యం మొదలైనవి లభిస్తాయని నమ్మకం. అంతేకాదు ఎవరైనా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.
ఈ అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య కూడా అవుతుంది. ఈసారి మార్గశిర అమావాస్య సోమవారం వస్తుంది. కనుక ఈ రోజున సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. అయితే మార్గశిర అమావాస్య తిథి విషయంలో గందరగోళం నెలకొంది. ఈ అమావాస్య డిసెంబర్ 30న జరుపుకోవాలని కొందరు, 31న అమావాస్య జరుపుకోవాలని మరికొందరు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో 2024 సంవత్సరంలో మార్గశిర అమవాస్య తిధి అంటే సోమవతి అమావాస్య రోజున స్నానం, దానానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం.
వైదిక క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి డిసెంబర్ 30 తెల్లవారుజామున 4.01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ అమావాస్య తిథి మర్నాడు రోజు డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది.
అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం మార్గశిర అమావాస్య 30 డిసెంబర్ 2024 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం చివరి అమావాస్య చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజు సోమవారం కనుక. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున శుభకార్యాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.