Telugu News Spiritual Manidweepa Varnana significance and lyrics in Telugu Everyone Must Listen or reaD To This Devotional Son Every day 9 Times
Manidweepa Varnana: సుఖ సంపదలను ఇచ్చే మణిద్వీప వర్ణన.. ఈ విధంగా పారాయణం చేయండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం
Manidweepa Varnana: హిందువులు(Hindus) శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు. శ్రీచక్ర బిందు రూపిణి(Sri Chakra Bindu Rupini) జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు(Sri Lalita Parabhattaria) నివాసం ఉండే..
Manidweepa Varnana: హిందువులు(Hindus) శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు. శ్రీచక్ర బిందు రూపిణి(Sri Chakra Bindu Rupini) జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు(Sri Lalita Parabhattaria) నివాసం ఉండే పవిత్ర ప్రదేశం మణి ద్వీపం. 14 లోకాలు, సర్వ లోకం ఆమెలో కొలువై ఉన్నారని హిందువుల నమ్మకం. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిదీపం పుట్టింది. ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే.. మానవ శక్తి సరిపోదు.. . మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకనే దేవి భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు. విష్ణువు నివసించే వైకుంఠం, శివుడు నివసించె కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపం అద్భుతంగా ఉంటుంది. అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అందుకనే మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా, సిరిసంపదలతో ఇల్లు కళకళలాడన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తుంటారు. అమ్మవారి కీర్తిస్తూ.. చేసే మణిద్వీప పారాయణంతో వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.
మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు. సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారణం చేయడం విశిష్టత ఫలాన్ని ఇస్తుంది. అమ్మకు పూజ చేసి.. నైవేధ్యాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని దేవి భాగవతంలో చెప్పారు.
మహాసంపదలిచ్చు – మణిద్వీప వర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||
ఫలశృతి: 14 లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తిస్తూ తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కనుక.. మణిద్వీపాన్ని రోజుకు తొమ్మిది సార్లు చదివిన వారికి విశేష ఫలితాలు అందుతాయి. మణిద్వీపాన్ని శుక్రవారం రోజున తొమ్మిది సార్లు చదివిన వారికి ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలుగుతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగుతారు. అలా పారాయణం చేసిన వారు చివరకు మణిద్వీపం చేరతారని శాస్త్రవాక్యం. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటే సకల పాపాలూ నశిస్తాయని భక్తుల విశ్వాసం.