Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti: అదిగదిగో మకరజ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన శబరి గిరులు TV9 ప్రత్యక్షప్రసారంలో వీక్షించండి..

Shiva Prajapati

|

Updated on: Jan 14, 2021 | 7:00 PM

Sankranti: మరికాసేపట్లో శబరిగిరులపై మకరజ్యోతి దర్శనమివ్వనుంది. అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం కోసం వేలాదిమంది

Sankranti: శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో మకరజ్యోతి మూడుసార్లు దర్శనమిచ్చింది. జ్యోతిస్వరూపుడిని దర్శించుకుని భక్తులు పులకించి పోయారు. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపుడు దర్శనమివ్వడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగాయి. కాగా, అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా భావించే మకరజ్యోతి దర్శనం కోసం వేలాదిమంది భక్తులు శబరిమలకు తరలి వచ్చారు. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు చేరుకున్నారు. ఎంతోమంది భక్తులు మకర జ్యోతి దివ్యదర్శనం చేసుకుని దివ్యానుభూతిని పొందారు.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి ఇవాళ కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే దేవస్థానం అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ మేరకు టికెట్లు కూడా జారీ చేశారు. ఈ కారణంగా ఈ ఏడాది లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లలేకపోయారు. అయితే శబరిమలలో ఉన్న కొద్ది మంది భక్తులు మాత్రమే మకరజ్యోతిని దర్శించుకోగలిగారు. మరోవైపు శబరిమలకు వెళ్లలేకపోయిన స్వామి వారి భక్తులు టీవీల ముందు వాలిపోయారు. అయ్యప్ప రూపంగా భావించే మకర జ్యోతిని ఈ విధంగా అయినా దర్శించుకోవచ్చునని భావించి టీవీల్లోనే స్వామి వారి జ్యోతి స్వరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. ఆ సందర్భంగా భక్తులు తమ తమ మనుసుల్లోనే అయ్యప్ప నామాన్ని జంపించారు.


Also read:

ప్రపంచ అప్‌డేట్.. ఇరవై లక్షలకు చేరువైన కరోనా మరణాలు.. మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..!

Cock Fights: వరంగల్‌ జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్టు.. నగదు, బైక్‌లు స్వాధీనం

Published on: Jan 14, 2021 06:45 PM