దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శివుడు, శివ భక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివభక్తులందరూ తమ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు. అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి. దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నుడవుతాడు. అంతేకాదు వ్యక్తి జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొందుతాడు.. మోక్షం లభిస్తుందని విశ్వాసం.
శివపురాణం ప్రకారం, ఒక రోజు పార్వతిదేవి శివయ్యతో మాట్లాడుతూ.. మీ భక్తులకు ఏ వ్రతాన్ని అసచారిస్తే మీరు తృప్తి చెంది.. మోక్షాన్ని అందిస్తారని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవీ నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు. అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు భక్తులు ఉపవాసం శ్రేష్టమైనది అని భావిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో పది నియమాలున్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ ఉపవాసాల నియమాలను మీకు చెప్తాను. వీటిని పాటించడం వలన తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెప్పారు.
ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలు పెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకుని.. ఆహారం తీసుకోవాలి. అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు. పగటిపూట ఉపవాసం ఉండండి రాత్రి తినండి. అలాగే శుక్ల పక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు. అదేవిధంగా శుక్ల పక్షంలోని త్రయోదశి నాడు రాత్రి పూట ఉపవాసం చేయాలి.. అదే కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ఆహారం తీసుకోకూడదు.
ప్రతి నెలా వచ్చే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది. ఇది మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. శివపురాణం ప్రకారం, ఈ రోజున, తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుని పూజించండి. పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుడిని కోరుకోవాలి. అప్పుడు కామము, క్రోధము, శత్రువులు మొదలగునవి భక్తుల దరిచేరవు. అంతేకాదు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు