మహాశివరాత్రి స్పెషల్ సత్తుపిండి లడ్డూలు.. శివుడికి ఎంతో ప్రీతికరమట.. ఎలా చేయాలో తెలుసా..

|

Mar 11, 2021 | 10:18 AM

శివ.. అంటే శుభం. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడాని

మహాశివరాత్రి స్పెషల్ సత్తుపిండి లడ్డూలు.. శివుడికి ఎంతో ప్రీతికరమట.. ఎలా చేయాలో తెలుసా..
Follow us on

శివ.. అంటే శుభం. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడానికి మనం విశిష్టమైన రోజు మహా శివరాత్రి.. సృష్టిలో లింగస్వరూపం జ్యోతిస్పాటిక రూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అన్ని పండుగలకు రకరకాల నైవేద్యాలు, వంటలు చేస్తారు కానీ ఈ మహాశివరాత్రికి మాత్రం కటిక ఉపవాసంతో పండుగను చేసుకుంటారు. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశిరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజున పరమేశ్వరుడికి ఇష్టమైన సత్తుపిండి లడ్డూలను ఎలా చేయాలో తెలుసుకుందాం.

సత్తుపిండి లడ్డూలు తయారీ విధానం.

కావల్సిన పదార్థాలు..

మొక్కజొన్నలు లేదా జొన్నలు – కేజీ
మినుములు – 100గ్రాములు.
నువ్వులు – పావుకిలో
పంచదార – అరకేజీ

తయారీ విధానం..

ముందుగా మొక్కజొన్నలను ఒక బాణలిలో దోరగా వేయించుకోని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, మినుములను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. పంచదారను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాతా నువ్వులు, మినుములు, మొక్కజోన్నలను కలిపి మిక్సీ పట్టుకోవాలి. అందులో పంచదార పొడిని కలిపిస్తే సరి. సత్తుపిండి రెడి అవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి కలిపి లడ్డూల్లా కూడా చుట్టుకోవచ్చు.

జొన్న లడ్డూ..

కావల్సినవి..
జొన్నరవ్వ- కప్పు
పంచదార, బెల్లం తురుము- కప్పు
బాదం, జీడిపప్పు – అర కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు.
గోరువెచ్చని పాలు -పావు కప్పు,
యాలకుల పొడి – పావు టీస్పూన్

తయారీ విధానం..

ఓ బాణాలిలో టీస్పూన్ నెయ్యి వేసి బాదం, జీడిపప్పుల్లో సగం వేయించి పొడి చేసుకోవాలి. మిగిలిన సగం సన్నని ముక్కులుగా చేయాలి. పప్పులను వేయించిన బాణలిలోనే మిగిలిన నెయ్యి వేసి జొన్న పిండి వేసి సిమ్ మీద బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. పిండి వేడిగా ఉండగానే పంచదార లేదా బెల్లం తురుము, బాదం, జీడిపప్పుల పొడి, తరిగిన పప్పులు, యాలకుల పొడి వేసి కలిపి ఓ నిమిషం వేయించి దించాలి. మిశ్రమం తర్వాత పాలు చిలకరించి కావలసిన సైజులో లడ్డులూ చేసుకోవాలి.

Also Read:

టమాటా పులిహోరా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మరింత రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండిలా..