Mahabharat: ఆడవారి కన్నీరు వంశ వినాశనమా.. కృష్ణుడి మరణానికి, ద్వారక నగర నాశనానికి ఇదే కారణమా.. పౌరాణిక కథ ఏమిటంటే

|

Feb 04, 2024 | 7:44 AM

గాంధార రాజు కుమార్తె.. ధృతరాష్ట్రుని భార్య.. 101 మంది పిల్లలకు తల్లి.  మహాభారత యుద్ధంలో తన వంద మంది కుమారులూ మరణించడంతో గాంధారి గర్భ శోకంతో బాధపడింది. మహాభారత యుద్ధంలో కౌరవులకు భీష్మ పితామహుడు, గురు ద్రోణుడు వంటి ఎందరో అనుభవజ్ఞులైన యోధులు అండగా నిలిచారు. కౌరవుల తరపున రణరంగంలో నిలిచారు. మరోవైపు శ్రీ కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చాడు. శ్రీ కృష్ణుడి చెప్పిన ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. కౌరవులు అందరూ మరణించారు. 

Mahabharat: ఆడవారి కన్నీరు వంశ వినాశనమా.. కృష్ణుడి మరణానికి, ద్వారక నగర నాశనానికి ఇదే కారణమా.. పౌరాణిక కథ ఏమిటంటే
Gandhari Cursed Krishna
Follow us on

రామాయణం, మహాభారతం, గీత వంటివి హిందువుల పవిత్ర గ్రంథాలు.. మానవాళి జీవన విధానానికి దిక్సూచికలు. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతం ఎలా ఉండకూడదో తెలియజేస్తుందని మన జీవితంలో రోజూ కనిపించే ప్రతి వ్యక్తి ఈ గ్రంథాల్లో దర్శనం ఇస్తాయని పెద్దలు చెబుతారు. పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకటి గాంధారి. తన భర్త చూడని లోకాన్ని తాను చూడనంటూ తన కళ్లకు గంతలు ధరించి ఆజన్మాంతం జీవించిన గాంధారి.. కౌరవుల తల్లి అయిన గాంధారి రాజు కుమార్తె.. ధృతరాష్ట్రుని భార్య.. 101 మంది పిల్లలకు తల్లి.  మహాభారత యుద్ధంలో తన వంద మంది కుమారులూ మరణించడంతో గాంధారి గర్భ శోకంతో బాధపడింది.

మహాభారత యుద్ధంలో కౌరవులకు భీష్మ పితామహుడు, గురు ద్రోణుడు వంటి ఎందరో అనుభవజ్ఞులైన యోధులు అండగా నిలిచారు. కౌరవుల తరపున రణరంగంలో నిలిచారు. మరోవైపు శ్రీ కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చాడు. శ్రీ కృష్ణుడి చెప్పిన ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు. కౌరవులు అందరూ మరణించారు.

శ్రీ కృష్ణుడిని దోషిగా భావించిన గాంధారీ

మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేసి వారు గెలవడానికి శ్రీ కృష్ణుడే కారణమని.. అదే సమయంలో తన కుమారులందరూ మరణించడానికి కూడా కృష్ణుడే కారణమని ఆమె నమ్మింది. అంతేకాదు  శ్రీ కృష్ణుడు కోరుకుంటే మహాభారత యుద్ధం జరిగేది కాదని.. తనకు పుత్ర శోకం ఉండేది కాదని గాంధారి నమ్మింది. అయితే యుద్ధాన్ని కోరుకున్న శ్రీ కృష్ణుడు పాండవులకు అండగా నిలబడి తన వంశం వినాశనానికి కారణం అయ్యాడని.. కోపంతో శ్రీకష్ణుడిని గాంధారి శపించింది. మహాభారత యుద్ధంలో నా వంద మంది కొడుకులు చనిపోయినట్లే.. నువ్వు కూడా మరణిస్తావు.

గాంధారి శాపం ద్వారక నాశనం

గాంధారి తన నూరుగురు కుమారులను పోగొట్టుకుని గర్భ శోకాన్ని అనుభవిస్తూ.. ఆ కోపముతో శ్రీకృష్ణుని నిందించింది. నేను నిర్మలమైన భక్తితో విష్ణుమూర్తిని పూజించినట్లయితే నా కుటుంబం ఎలా నాశనమైందో..  అదే విధంగా మీ వంశం నాశనం అవుతుంది. మీ కళ్ల ముందు విధ్వంసం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు. కానీ ఆ వినాశనాన్ని ఏ విధంగా ఆపలేరు.. అంటూ గాంధారీ కృష్ణుడికి శాపం ఇచ్చింది. గాంధారి  మాటలు విన్న శ్రీకృష్ణుడు అమ్మా.. నీవు ఇచ్చిన శాపాన్ని నేను వరంగా భావిస్తున్నాను. ఈ నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. యుధిష్ఠిరుని పట్టాభిషేకం తర్వాత శ్రీ కృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి చేరుకున్నాడు. మహాభారత యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజ రూపం దాల్చి.. ముసలం పుట్టి యదు వంశాన్ని నాశనం చేసింది. ద్వారకా నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు