శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగబోయే.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 11న సాయంత్రం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ జరుగనుంది. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు.
ఈ నెల 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఉండనుంది. ఈనెల 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..